మెరుగైన సేవలు అందించాలి

Sun,October 14, 2018 01:52 AM

కామారెడ్డి నమస్తే తెలంగాణ : ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు ఇంకా త్వరగా, మెరుగ్గా, సుపరిపాలన అందించడంలో ప్రభుత్వ శాఖలు ముందుండాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు.శనివారం కలెక్టర్ చాంబర్‌లో దురాంక్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ హైదరాబాద్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్, టైన్నింగ్ లీడర్ రమేశ్ తమ ప్రాజెక్ట్ వివరాలు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఇంకా త్వరగా మెరుగైన సేవలు, సుపరిపాలన అందించడంతో భాగంగా మానవ మేధస్సుకు ఆర్టిఫిషయల్ ఇంటలిజెంట్ సేవలు (కృత్రిమ మేధస్సు) కూడా తోడైతే ఫలితాలు మంచిగా వస్తాయని అన్నారు. వైద్య, విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత, మౌలిక వసతులు ఇంకా పూర్తి స్థాయిలో సత్వరమే ప్రజలకు చేరువ కావాలని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణ సమతుల్యత లేక పోవడంతో అభివృద్ధికి విఘాతం కలుగుతుందని అన్నారు.

సిబ్బంది గైర్హాజరు తగ్గించుట, ఎరువులు మందులు రైతులకు అందడం, పంటకు సంబంధించి వివరాలు, వర్షాపాతం వివరాలు, వర్షాభావ పరిస్ధితులు విష్లేశించుకోవాలని అన్నారు. రక్తనిధి సేకరణలో దాతలు వివరాలు, వైద్య రంగంలో కేసుల వివరాలు, దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత వారికి క్రమం తప్పకుండా తీసుకునే జాగ్రత్తలను వాయిస్ రికార్డుల రూపంలో తెలుపాలని అన్నారు. పశువులు వ్యాధులకు సంబంధించి అప్రమత్తం చేయాలని అన్నారు. ఎంపీ ల్యాడ్స్, సీబీఎఫ్ నిధుల వివరాలు అప్‌డేట్‌గా ఉంచాలని అన్నారు. మహిళా సంఘాలతో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని అన్నారు. బీపీ, షుగర్ పరీక్షలు చేయాలని అన్నారు. ఇతర సంక్షేమ రంగాల్లో సేవలు సత్వరంగా పొందాల్సి ఉంటుందని అన్నారు. దీనికి సంబంధించి సంబంధిత శాఖల అధికారులు మెరుగైన సేవలు ఎలా పొందాలో దురాంక్ వారికి తెలియజేసి వారి సేవలు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్, సీపీవో శ్రీనివాస్, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ రమేశ్, వ్యవసాయశాఖ అధికారి నాగేంద్రయ్య, ఉద్యానవన శాఖ అధికారి శేఖర్, డీఎంహెచ్‌వో డా.చంద్రశేఖర్, రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ సెక్రెటరీ రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

129
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles