అభివృద్ధికి పట్టంకట్టండి

Thu,October 11, 2018 11:56 PM

పెద్దకొడప్‌గల్ : సమైక్య పాలనలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసి చూపిందని, చేసిన అభివృద్ధిని చూసి పట్టం కట్టాలని టీఆర్‌ఎస్ జుక్కల్ అభ్యర్థి హన్మంత్ షిండే అన్నారు. గురువారం మండలంలోని చావుని తండా, తలాబ్‌తండా, శివాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. షిండేకు గ్రామ గ్రామాన ఘన స్వాగతం లభించింది. పటాకులు కాలు స్తూ.. డప్పు చప్పుళ్ల మధ్య ఆహ్వానం పలికారు. తామంతా టీఆర్‌ఎస్ వెంటే అంటూ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని హన్మంత్ షిండే మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దారని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ వెంట నడుస్తామంటూ గిరిజనులు కదిలిరావడం తాము సాధించిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. తిరిగిన తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే పండుగలపై ప్రతిపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని మండిపడ్డారు. బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేయకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రతిక్షాల డిపాజిట్లు గల్లంతవుతాయని, మహిళలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు. మండలంలోని తాలబ్ తండా, చావుని తండా, శివాపూర్ గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేశారు.

భారీగా చేరికలు
మండలంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పెద్దకొడప్‌గల్ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి జాఫర్ షా 20 మంది కాంగ్రెస్ మైనార్టీ నాయకులతో కలిసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి హన్మంత్ షిండే టీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శివాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది, తాలబ్ తండాకు చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, జుక్కల్ జడ్పీటీసీ మాధవ్‌రావు దేశాయ్, మాద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయాగౌడ్, గుండుపటేల్, సాయిరెడ్డి, చావుని తండాలో మోతిలాల్, చందానాయక్, మనోహర్‌రావ్, ఉత్తమ్, ప్రహ్లాద్, టీఆర్‌ఎస్ మండల యువజన నాయకులు కృష్ణమూర్తి, తిరుమలరెడ్డి, లాయక్, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

140
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles