వేగవంతం చేయాలి

Sat,September 22, 2018 12:03 AM

- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్
- ఓటర్ల నమోదుపై వీడియో కాన్ఫరెన్స్
- పాల్గొన్న కలెక్టర్ సత్యనారాయణ
కామారెడ్డి నమస్తే తెలంగాణ : అర్హులైన ఓటరుల నమోదును వేగవంతం చేయాలి అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోగస్ ఓట్లు, రెండు చోట్ల ఓటరు కార్డులు ఉన్న వారు, చనిపోయిన వారి వివరాలపై పలు సూచనలు చేశారు. ఈ నెల 25 వరకు ఓటరు నమోదు కార్యక్రమం ఉన్నందున అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. వందేళ్లు పైబడిన ఓటర్ల వివరాలను సేకరించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల జాయింట్ సీఈవో అమ్రపాలి పలు సూచనలు చేశారు. కలెక్టర్ సత్యనారాయణ జిల్లాకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్, కామారెడ్డి ఆర్డీవో రాజేందర్‌కుమార్, ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, కామారెడ్డి తహసీల్దార్ రవీందర్, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

104
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles