బీసీల రుణ జాతర..!

Fri,September 21, 2018 01:21 AM

- రేపు 302 మందికి చెక్కులు మంత్రి పోచారం
- ఎంబీసీ, బీసీలకు బాసటగా ప్రభుత్వం
- ఐఎస్‌బీ పథకం కింద 100 శాతం రూ.50వేలు మంజూరు
- జిల్లాలో ఇప్పటికే 100 కుటుంబాలకు మేలు
- ఎయిడ్స్ బాధితులు, వితంతువులు, కులాలకు భారీ ప్రయోజనం
- బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరుతో వ్యక్తం చేస్త్తున్న ప్రజలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆర్థిక చేయూత కోసం ఎదురు చూస్తున్న వారందరికీ తెలంగాణ ప్రభుత్వం భారీ సబ్సిడీలతో ఆర్థిక సాయం చేస్తోంది. అది కూడా చెప్పులు అరిగేలా తిప్పించుకోకుండానే ప్రక్రియను పూర్తి చేస్తుంది. దరఖాస్తు చేసిన ఆశావహుల్లో అర్హతలను ఆధారంగా రుణాలు మంజూరు చేస్తోం ది. దరఖాస్తుదారుల అవసరాలను గుర్తించి సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యతను కల్పిస్తోంది. ఎంబీసీ, బీసీ కు లాల్లోని ప్రజలకు రూ.50 వేలు చొప్పున వందశాతం రా యితీతో ఐఎస్‌బీ పథకం కింద ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతలో జిల్లావ్యాప్తంగా వంద మందిని గుర్తించి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చెక్కులు అందించారు. మలి విడతలలో భాగంగా మరికొంత మంది అర్హులకు ప్రయోజనం చేకూర్చేందుకు బీసీ కార్పొరేషన్ సిద్ధం అయ్యింది. ఈ మేరకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి లబ్ధిదారులకు రూ.50 వేలు రుణ సాయం చెక్కులను రోటరి క్లబ్ ఆడిటోరియంలో పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు 302 మందిని రెండో విడతకు గుర్తించారు. విడతల వారీగా దరఖాస్తు చేసిన వారిలో అర్హులందరికీ రుణాలు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. యుద్ధ ప్రాతిపదికన ఆర్థిక స్వాలంబనతో వెనుకబడిన వర్గాల్లో పేదరికాన్ని పోగొట్టాలన్న ఆశయంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని రూపొందించారు.

అత్యంత పారదర్శకంగా రుణాలు..
గతంలో రుణాలు చేతికి చిక్కాలంటేనే అదో ప్రహసనం గా ఉండేంది. బ్యాంకు లింకేజీల కోసం బ్యాంకు అధికారు ల చుట్టూ తిరగడం, ఇటు యూనిట్ మంజూరు కోసం అధికారులను ప్రసన్నం చేసుకోవడం పరిపాటిగా ఉండేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులకు రుణాలను అందిస్తున్నారు. మూడో వ్య క్తి ప్రమోయం లేకుండానే దరఖాస్తు దారునికే సమాచారం అందించి రూపాయి ఖర్చు లేకుండానే వందశాతం రాయితీ సొమ్మును అందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి యూనిట్ మంజూరు దా క అడుగడుగునా అవినీతి, దళారుల ప్రమేయం కనిపించేది. చెప్పులు అరిగేలా తిరిగినా బ్యాంకుల కనికరం పొందలేక చాలా మంది దరఖాస్తుదారులు విసిగి వేసారే వారు. ఈ రకమైన దౌర్భాగ్యకరమైన పరిస్థితులను మార్చేందుకు సీఎం కేసీఆర్ పకడ్బందీ వ్యవస్థను రూపొందించారు. ఆన్‌లైన్ ఆధారంగానే దరఖాస్తు ప్రక్రియ, మంజూరు విధానం చేపట్టడంతో దళారుల పాత్ర సమసిపోయింది. లబ్ధిదారులకు ఇట్టే రుణాలు సైతం అందుతున్నాయి.

సందట్లో సడేమియాలు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాయితీ రుణ పథకాల్లో కొంత మంది కుల సంఘాల ప్రమేయంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దరఖాస్తు దారు ల అమాయకత్వాన్ని గ్రహించి వారి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి సైతం వ చ్చింది. పైసా ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీతో యూనిట్లు మంజూరు చేస్తుంటే జిల్లాకేంద్రంలోని కొంత మంది వ్యక్తులు సంఘాల ముసుగులో దోపిడీ కి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పంద్రాగస్టు రోజున వంద మందికి రుణాలు మంజూరు చేయగా, తలా ఒక్కొక్కరి నుంచి రూ.1000 నుంచి రూ.2000 వరకు వసూళ్లకు తెగబడ్డట్లు సమాచారం. తామే అంతా చూసుకున్నామంటూ లబ్ధ్దిదారుల ముందు ప్రగల్బాలు పలుకుతూ ముక్కు పిండి వసూలు చేసినట్లు తెలిసింది. సంఘాల ముసుగుతో ఇళ్ల వద్దకే రావడంతో రుణ గ్రహీతలు సైతం చేసేది లేక వాళ్లు అడిగినంత ఇచ్చినట్లు తెలుస్తోంది. రుణ మంజూరులో సామాజిక వర్గాల పాత్ర ఉండబోదని, లబ్దిదారులు ఎవ్వరూ యూనిట్ మంజూరుకు ముందు, చెక్కులు స్వీకరించిన తర్వత ఎవ్వరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు.

బీసీ రుణాలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో ఐఎస్‌బీ పథకం కింద బీసీ, ఎంబీసీలకు రుణాలు అందించేందుకు ఏర్పాట్లు చేశాం. మొదటి విడతలో వంద మందికి రూ.50వేలు చొప్పున వం ద శాతం రాయితీతో రుణం మంజూరు చేశాం. రేపు రెండో విడతలో భాగంగా 302 మందికి చెక్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశాం. రుణ గ్రహీతల ఎంపిక ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగింది. ఎవరైనా సంఘాల ముసుగులో డబ్బులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయొచ్చు. ఏ ఒక్కరికీ కూడా డబ్బు లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి వారిపై ఫి ర్యాదులు ఇస్తే కేసులు పెట్టేందుకు వెనుకాడబోం. లబ్దిదారులు సైతం జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది.
- ఝాన్సీ ఠాకూర్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి

128
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles