నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలి


Thu,September 20, 2018 12:04 AM

విద్యానగర్: గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, శాంతియుతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని ఈఎస్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన గణేశ్ ఉత్సవ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. నిమజ్జన ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. భారీ విగ్రహాల దారి మళ్లింపు విషయంలో పోలీసులు ముం దుండి గణేశ్ మండలి సభ్యులకు సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్, ఆర్డీవో రాజేందర్‌కుమార్,డీఎస్పీ ప్రసన్నారాణి, మున్సిపల్ కమిషనర్ రామాంజులారెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బాపురెడ్డి, ప్రధానకార్యదర్శి కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...