రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగదు


Thu,September 20, 2018 12:03 AM

పాత బాన్సువాడ : ఎస్టీలంటే కోయ, గోండు జాతులే కాదని రాజ్యాంగ బద్ధంగా బంజారాలు కూడా ఎస్టీలేనని ఆలిండియా బంజారా సంఘం మండల అధ్యక్షుడు రాము రాథోడ్ అన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎస్టీ నియోజకవర్గాల్లో బంజారాలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరాదని చేస్తున్న రాద్ధాంతంపై స్పందించారు. రాజ్యాంగ, న్యాయబద్ధంగా గిరిజనుల్లోని బంజారాలు కూడా అర్హులని అన్నారు. సమావేశంలో ఆలిండియా బంజారా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రవి చవాన్, జిల్లా కోశాధికారి అంబర్‌సింగ్, బలరాం సింగ్, రూప్‌సింగ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...