కూటమి కుట్రలు పటాపంచలు..!

Wed,September 19, 2018 01:31 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/లింగంపేట: అధికారమే పరమావధిగా ఎంతటికైనా తెగించేందుకు సిద్ధపడిన కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యకర్తలే బుద్ధి చెబుతున్నారు. నాడు తెలంగాణ ఉద్యమాన్ని, నేడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న టీడీపీతో హస్తం పార్టీ జత కట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రజల మనసులు గెలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఢీ కొట్టలేక టీపీసీసీ నేతలంతా ఆంధ్రా పార్టీతో జత కట్టి ఎన్నికల బరిలోకి దిగేందుకు కసరత్తులు ప్రారంభిస్తుండడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ కుట్రలను గ్రహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యకర్తలే ఎక్కడికక్కడ చేయిచ్చేసి కారు ఎక్కేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే, అభివృద్ధి గ్రాఫ్ ఇలాగే ఉండాలంటే మళ్లీ రాష్ట్రంలో గులాబీ పార్టీయే అధికారంలోకి రావాలన్న అభిప్రాయంతో హస్తం నేతలంతా కేసీఆర్ పక్షాన చేరుతుండడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు సాగుతుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. జిల్లాలో చేరికల పర్వం నిత్యం సందడి వాతావరణంలో కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లో 22 మండలాల్లో చేరికలు సాగుతున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ గడిచిన నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని గ్రహించి స్వచ్ఛందంగా గులాబీ కుండువాను కప్పుకుంటున్నారు. బలమైన లీడర్లు, ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు మాజీ స ర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీల్లోని వార్డు మెంబర్లు అంతా కేసీఆర్‌కు మద్దతు పలుకుతూ టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట వందలాది మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు గులాబీ గూటికి వస్తుండడం జిల్లాలో చర్చనీయాంశం అవుతోంది.

జోరుగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం...
సెప్టెంబర్ ఆరో తేదీన సీఎం కేసీఆర్ తీసుకున్న అసెంబ్లీ రద్దు, అనంతరం అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటనతో జిల్లాలో గులాబీ జోరు మొదలైంది. మరునాటి నుంచే జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లో నేతలు జనాల్లోకి వెళ్లి చేసిన అభివృద్ధిని వివరిస్తూ వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఈ నెల 15వ తేదీ నుంచి ప్రచారానికి శంఖారావం పూ రించారు. ఈ నెల 10వ తేదీ నుంచే కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గంప గోవర్ధన్ తన సొంతూరు బస్వాపూర్ నుంచి మొదలైన స్వాగత ర్యాలీతో సత్తాను చాటారు. ఈ నెల 7వ తేదీన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి సైతం రామారెడ్డి మండలంలోని కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 12వ తారీఖు నుంచి జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్ షిండే సై తం బిచ్కుంద మండలంలోని గోపన్‌పల్లి గ్రామం నుంచి ప్ర చారాన్ని నిర్వహించి ప్రతిపక్ష పార్టీలకు అందనంత దూరం లో ఉన్నారు. తమ ఇష్టదైవాలకు పూజలు, యాగలు నిర్వహిం చిన నేతలంతా కుటుంబీకుల అభినందనలు, తల్లిదండ్రుల ఆశీర్వచనలతో ప్రచార పర్వాన్ని జెట్ వేగంతో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని నలుగురు అభ్యర్థుల ప్రచార శైలికి మిగ తా పార్టీలన్నీ కంగు తింటుండగా ఆయా పార్టీల్లో అభ్యర్థుల ప్రకటనపై ఇంకా స్పష్టత రాకపోవడంతో గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు.

116
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles