న్యాయమే గెలిచింది..!

Wed,September 19, 2018 01:30 AM

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ/ కామారెడ్డి నమస్తే తెలంగాణ : విద్యుత్తు సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్ల (అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు) సర్వీసును క్రమబద్ధ్దీకరించేందుకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది ఉద్యోగులు రెగ్యులర్ కాగా, జిల్లాలో సుమారు 500 మందికి మేలు చేకూరింది. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధ్దీకరించడానికి సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. దీంతో ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్, జెన్‌కో సంస్థల్లో పని చేసే 23 వేల మంది ఆర్టిజన్ల క్రమబద్ధ్దీకరించడానికి లైన్ క్లియర్ అయింది. విద్యుత్తు సంస్థల్లో ఎంతో కాలంగా పని చేస్తున్న వీరి సర్వీసులను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖ అధికారులను గతంలోనే ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు 23 వేల మంది సర్వీసులను క్రమబద్ధ్దీకరిస్తూ గత ఏడాది నాలుగు విద్యుత్తు సంస్థలు ఆదేశాలు జారీచేశాయి. దీనిని సవాలు చేస్తూ కొందరు హైకోర్టులో పిటీషన్లు వేశారు.

దీనిపై హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాదం అంచులో ప్రతి దినం విధులు నిర్వహిస్తున్నారని, ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి సర్వీసులను క్రమబద్ధ్దీకరించక పోవడంతో కలుగుతున్న ఇబ్బందులను ఆ శాఖ తరుఫున లాయర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. వారిని సర్వీసును క్రమబద్ధ్దీకరించాలన్న ప్రభుత్వ మానవీయ థృక్పదాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. మెరుగైన విద్యుత్తు సరఫరా కోసం కష్టపడుతున్న ఆర్టిజన్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగానే ఉంటున్నారని, ఉద్యోగ భద్రత లేదని కోర్టుకు విన్నవించారు. విద్యుత్తు శాఖ వాదనలను హైకోర్టు సమర్థించింది. సవాలు పిటీషన్‌ను కొట్టి వేసింది. దీంతో ఆర్టిజన్లు కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా మారనున్నారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles