ఓటమి గెలుపునకు నాంది కావాలి

Tue,September 18, 2018 01:05 AM

వర్ని: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపునకు నాంది కావాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విద్యార్థులకు సూచించారు. వర్ని, రుద్రూర్ మండలాల అంతర్ పాఠశాలల మండల స్థాయి క్రీడాపోటీల ప్రారంభోత్సవానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. విద్యార్థులు ఆటల్లో క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. ఓడిపోయిన వారు బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. క్రీడల ప్రారంభోత్సవంలో ఏర్పాటు చేసిన మార్చ్ ఫాస్ట్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిని తలపించినట్లుగా అనిపించిందని మంత్రి పేర్కొన్నారు. క్రీడల ఏర్పాటుకు ముందుకొచ్చిన నిర్వాహకులు, ఉపాధ్యాయులు, మోస్రా పాఠశాల సిబ్బందిని మంత్రి అభినందించారు. త్వరలో మోస్రాలో పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గుత్ప విజయభాస్కర్ రెడ్డి, ఎంపీపీ చింగ్లిబాయి బజ్యానాయక్, ఏఎంసీ చైర్మన్ నారోజి దేవూబాయి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారోజి గంగారం, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పిట్ల శ్రీరావు, టీఆర్‌ఎస్ వర్ని రుద్రూర్ మండలాల అధ్యక్షులు మేక వీర్రాజు, పత్తి లక్ష్మణ్, సొసైటీ వైస్ చైర్మన్ అరికెల సాయిరెడ్డి, సొసైటీ చైర్మన్లు నేమాని వీర్రాజు, గోవూర్ హన్మంత్ రెడ్డి, పత్తి రాము, నాయకులు బజ్యానాయక్, ఎంఈవో శాంతాకుమారి, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

104
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles