ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలి

Tue,September 18, 2018 01:03 AM

నాగిరెడ్డిపేట : ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈవో వెంకటేశం హెచ్చరించారు. సోమవారం నాగిరెడ్డిపేట మండలంలోని రామక్కపల్లి, తాండూర్, చిన్న ఆత్మకూర్, తాటిగడ్డ చెట్టు తండా,జలాల్‌పూర్ పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు సమయానికి మధ్యాహ్న భోజనం అందజేయాలని తెలిపారు. చదువుల్లో వెనుబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటేలా చూడాలన్నారు. అనంతరం ఆత్మకూర్ పాఠశాలలో నిర్వహించిన ఎస్‌ఎంసీ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అరవింద్, సీఆర్పీ కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles