నేటి నుంచి అంతర్ పాఠశాలల క్రీడలు

Tue,September 18, 2018 01:02 AM

తాడ్వాయి : మండల పరిధిలో అంతర్‌పాఠశాలల క్రీడలు మంగళవా రం నుంచి నిర్వహిస్తున్నట్లు ఎంఈవో రామస్వామి తెలిపారు. 18న నందివాడ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ పోటీలు, 19న కన్‌కల్ పాఠశాలలో కబడ్డీ పోటీలు, 20న తాడ్వాయి పాఠశాలలో ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అండర్17, అండర్ 14 విభాగాలలో బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles