జాతీయ పార్టీలకు ఝలక్..!

Thu,September 13, 2018 12:59 AM

-టీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న భారీ
-నియోజకవర్గాల్లో మరింత గులాబీ పార్టీ
-ఉత్సాహంగా కారెక్కుతున్న కాంగ్రెస్, పార్టీల ముఖ్య నేతలు
-కంగుతింటున్న ప్రతిపక్ష పార్టీల
-త్వరలో మరికొంత మంది కీలక నేతలు అవకాశం
-శ్రేణులు చేజారకుండా శతవిధాలుగా పడుతున్న ఆయా పార్టీలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/నిజాంసాగర్, నమస్తే తెలంగాణ : దశాబ్దాల చరిత్రను మూట కట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కామారెడ్డి జిల్లాలో విలవిల్లాడుతున్నాయి. పార్టీలో ముఖ్య లీడర్లుగా కొనసాగుతోన్న నేతలంతా చేజారుతుండటంతో అసెంబ్లీలో పోటీకి సిద్ధపడుతున్న ఆశావాహులంతా ఒక్కసారిగా కంగుతింటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు ఈ మధ్యే గులాబీ గూటికి వచ్చి చేరారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి పొందిన సిద్ధిరాములు టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. రెండు నెలల క్రితమే సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కారెక్కారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మోడీ పరిపాలన తీరుపై విరక్తి చెందిన పలువురు నేతలంతా టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. ఇదివరకే కామారెడ్డి మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా గెలుపొందిన బీజేపీ నాయకులు సైతం టీఆర్‌ఎస్‌లో చేరారు. ముప్పారం ఆనంద్, కుంబాల రవి యాదవ్, విజయలతో పాటు పలువురు బీజేపీని వదిలి కారెక్కారు. ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి భారీ చేరికలు నమోదు అయ్యాయి. పీఏసీఎస్ చైర్మన్‌లు, డీసీసీబీ డైరెక్టర్లు, మండల పార్టీల బాధ్యులంతా ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు టీఆర్‌ఎస్ పార్టీ కుండవా కప్పుకున్నారు. రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలోనూ జాతీయ పార్టీల నేతలు వందలాది మం ది గులాబీ కండువా ధరించారు. ఇంటింటికీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తీసుకుపోతున్న పోచారం కృషిని చూసి ఆయా పార్టీల కార్యకర్తలంతా కారెక్కేస్తున్నారు. గతంలో పోచారానికి ప్రత్యర్థిగా నిలిచిన బద్యానాయక్ సైతం టీఆర్‌ఎస్ గూటికి వచ్చారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌లు, పీఏసీఎస్ బాధ్యులు సైతం పోచారం సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. జుక్కల్‌లో నూ ప్రాధాన్యత స్థాయిలో కాంగ్రెస్ నుంచి భారీగా చేరికలు న మోదు అయ్యాయి.

ప్రతిపక్ష నేతకు పరేషాన్..
కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమాగమైపోయింది. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో షబ్బీర్ అలీపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజం అయ్యేట్లు కనిపిస్తున్నాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడంతో జెండాలు కట్టుకోవాలన్నా షబ్బీర్ అలీకి అనుచరులు లేరని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తుందని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలంతా గుసగుసలాడుతున్నారు. రాష్ట్ర పీసీసీలో కీలకమైన నేతగా, శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతోన్న షబ్బీర్ అలీ కంచుకోటకు ఎక్కడికక్కడ బీటలు వారుతున్నాయి. ఇన్ని రోజుల పాటు షబ్బీర్‌ను అంటిపెట్టుకుని ఉన్న వారు సైతం రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనితీరును చూసి ఆకర్షితులవుతున్నారు. సెప్టెంబర్ 4వ తేదీ నాడే మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగ రావు, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు దాదాపుగా 2వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరడం చర్చకు దారితీసింది. ఇదివరకే మున్సిపాలిటీ చైర్మన్ పిప్పిరి సుష్మ, వైస్ చైర్మన్ మసూద్ అలీతో పాటు కౌన్సిలర్లు పద్మ రామ్‌కుమార్ గౌడ్, శశిరేఖ, గణేశ్, చాట్ల లక్ష్మీ, స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచిన లక్ష్మి సైతం గులాబీ పార్టీకే చేరారు. కామారెడ్డి నియోజకవర్గంలో జాతీయ పార్టీల నుంచి భారీగా వచ్చిన వలసలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కంగుతింటున్నాయి.

జిల్లా వ్యాప్తంగా కారు జోరు...
రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహాలు, ప్రణాళికలతో జిల్లా టీఆర్‌ఎస్ పార్టీలో కొంగొత్త హుషారు కనిపిస్తోంది. కొంగర కలాన్ సభతో నూతనోత్సాహంతో శ్రేణులు సంబురం చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 6వ తేదీనాడు అభ్యర్థుల ప్రకటనలతో జిల్లాలో సిట్టింగ్‌లు అందరికీ టికెట్లు దక్కడంతో గెలుపు ధీమా అంతటా వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించుకునే లోపే ప్రచార పర్వంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు దూసుకు పోతుండగా ఆయా నియోజకవర్గాల్లో కారు జోరు కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారంతో ఊరు, వాడ పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అభ్యర్థుల ప్రచారానికి సైతం విపరీతమైన స్పందన వస్తోంది. ప్రజల్లోకి దూసుకుపోతున్న నేతలంతా జనాలకు ధైర్యం నింపుతున్నారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికపై స్పష్టతను ఇస్తున్నారు. మొత్తంగా ఈ నెల మొదటి వారం నుంచే మొదలైన రాజకీయ సందడితో టీఆర్‌ఎస్ శ్రేణులు ఉత్సాహంతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.

126
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles