తల్లి ఆరోగ్యమే బిడ్డకు క్షేమదాయకం


Thu,September 13, 2018 12:59 AM

ఎల్లారెడ్డి రూరల్ : గర్భిణులు పోషకాహారం తిని ఆరోగ్యంగా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉంటుందని ఐసీడీఎస్ సీడీపీవో అజీజున్నీసా అన్నారు. ఎల్లారెడ్డి లోని గాంధీనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటుచేసిన ఇం టింటా పౌష్ఠికాహార సంబురా ల కార్యక్రమంలో ఆమె పా ల్గొని మాట్లాడారు. ప్రతినెలా డాక్టర్లు, ఐసీడీఎస్ సిబ్బంది ఇ చ్చిన సూచనలు ప్రకారం పౌ ష్ఠికాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏ సీడీపీవో సరిత, సూపర్‌వైజర్ అరుణ, అంగన్ వాడీ టీ చర్లు నీలారాణి, శోభ, పద్మ, సావిత్రి, అజ్మల్‌నాజ్నిన్, లక్ష్మి, నుస్రత్, భూలక్ష్మి, రాజమణి, రామలక్ష్మి, లలిత, జయశీల తదితరులు పాల్గొన్నారు.

పౌష్ఠికాహారం అందజేస్తున్నాం..
సదాశివనగర్ (రామారెడ్డి) : ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు, గర్భిణులకు, చిన్న పిల్లలకు పౌష్ఠికాహారం అందిస్తున్నట్లు సీడీపీవో శ్రీలత, ట్రైనీ సీడీపీ వో సుమలత అన్నారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడా రు. ప్రతి ఒక్కరూ కేంద్రంలోనే భోజనం చేయాలని, ఇం టికి తీసుకెళ్లవద్దని అన్నారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ జాకేరా బేగం, ఎంపీటీసీ శేట్టి లత రాజు, మాజీ సర్పంచి పడిగెల శైలజ శ్రీనివాస్, అంగన్‌వాడి కార్యకర్తలు ఇందిర, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...