దీవించండి..


Thu,September 13, 2018 12:58 AM

బిచ్కుంద: జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే బుధవారం బిచ్కుంద మండలం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తనకు సెంటుమెంటుగా ఉన్న గోపన్‌పల్లి గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అంతకు ముందు అయ్యప్ప చౌరస్తా నుంచి గోపన్‌పల్లి వరకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. గోపన్‌పల్లిలో పార్టీ జెండాను ఎగుర వేసి ఎస్సీ దళితవాడలో ఇంటింటికీ తిరిగి దీవించాలంటూ ఓట్లను అభ్యర్థించారు. లక్ష్మీబాయి అనే మహిళ హన్మంత్‌షిండే నుదుట విజయ తిలకం దిద్ది మంగళహారతితో స్వాగతం పలికారు. ఆడపడుచులు ఆయన విజయాన్ని కోరుకుంటూ మిఠాయిలు తినిపించారు. అనంతరం రచ్చబండ వద్ద ప్రసంగించారు. మండలంలో చేసిన అభివృద్ధి పనులు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, సదా మీసేవలో ఉంటూనంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావ్‌దేశాయ్, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ సర్పంచి సురేఖ సాయిలు, ఏఎంసీ చైర్మన్ రాజా శ్రీహరి, ఎన్‌ఎమ్ బాలరాజు, రమేశ్‌షెట్కార్, షేక్ పాషా, రాజుల అశోక్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...