నేడు కారెక్కనున్న నేరెళ్ల

Wed,September 12, 2018 01:09 AM

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. 15 ఏళ్ల పాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన తన అనుచరవర్గంతో రాజధానిలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వరుస విజయాలతో తెలుగు దేశం పార్టీలో హాట్రిక్ వీరుడిగా పేరు గాంచిన నేరెళ్ల ఆంజనేయులు 2004లో పార్టీ టికెట్ లభించక పోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి పని చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. స్వంత మండలమైన గాంధారి నుంచి వందలాది మంది అనుచరులు, నాయకులు, కార్యకర్తలతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గమైన మున్నూరు కాపు కులానికి చెందిని నేరెళ్ల ఆంజనేయులు చేరికతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని రాజకీయ వర్గాలు అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రిగా పని చేసిన బంధం ఉండడంతో ఆయనకు పార్టీలో మంచి గుర్తింపుతో పాటు పదవి సైతం లభించే అవకాశాలున్నాయని అధికార పార్టీ నాయకులే పేర్కొంటున్నారు.

141
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles