డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల పరిశీలన


Wed,September 12, 2018 01:08 AM

వర్ని: మండలంలోని మోస్రా గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూంలను ఈఈ నీలకంఠేశ్వర్‌తో కలిసి వర్ని జడ్పీటీసీ గుత్ప విజయభాస్కర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. మోస్రాలో ప్రస్తుతం చేపడుతున్న 30 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు పూరైన వెంటనే మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మరో 40 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మోస్రాకు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మంత్రి ఆదేశాలమేరకు ఇళ్ల నిర్మాణాలను పరిశీలించినట్లు ఈఈ నీలకంఠేశ్వర్ తెలిపారు. నిర్మాణాలను తొందరగా పూర్తి చేయించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆయన వెంట రైతు సమితి మండల అధ్యక్షుడు పిట్ల శ్రీరాములు ఉన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...