టీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తున్న పల్లెలు

Wed,September 12, 2018 01:08 AM

బాన్సువాడ రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన పథకాలతో తాము లబ్ధి పొందామని, తామంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీనే గెలిపించుకుంటామని వెల్లడిస్తున్నాయి పల్లెలు. బాన్సువాడ టీఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి ఓటువేసి భారీ మెజారీటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ రెండు గ్రామాల్లో మంగళవారం ఏకగ్రీవ తీర్మానాలు చేశారు ఆయా గ్రామాల ప్రజలు. బాన్సువాడ మండలంలోని రాంపూర్ తండా, పోచారం గ్రామస్తులు మంగళవారం ఈ తీర్మానాలు చేశారు. రాంపూర్ తండాకు చెందిన పెద్దలు గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తులందరూ మంత్రి పోచారం వెంటే ఉండాలని తీర్మానం చేశారు. ఆ తీర్మాన పత్రాన్ని టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, పార్టీ నాయకులకు అందజేశారు.

పోచారం గ్రామస్తులు ఉదయం చావిడి వద్ద కూర్చొని పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తీర్మాన పత్రాన్ని టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నార్ల సురేశ్ గుప్తా, మహ్మద్ ఎజాస్, జంగం గంగాధర్, ఎర్వాల కృష్ణారెడ్డి, అలీమొద్దీన్ బాబా, నారాయణరెడ్డి, పాత బాలకృష్ణ, బాడీ శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, రాంపూర్ తండా పెద్దలు ప్రకాశ్, హరిసింగ్, రామురాథోడ్, ఫకీరా నాయక్, అంబర్‌సింగ్, జైరాం, శ్రీనివాస్ నాయక్, గోప్యా నాయక్, పోచారం గ్రామస్తులు సాయిరెడ్డి, హర్జ్యానాయక్, బైరి అంజవ్వ, నరేశ్ గౌడ్, విజయ్ గౌడ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

113
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles