కాంగ్రెస్.. ఇక కనుమరుగే!

Wed,September 12, 2018 01:07 AM

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ: ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానరాకుండా పోతుందని ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఎల్లారెడ్డిలోని తన నివాసంలో పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం తెలుగుదేశం పార్టీకి చెందిన అడ్విలింగాల మాజీ సర్పంచు పర్వయ్య, లకా్ష్మపూర్ మాజీ సర్పంచు ఎరుకల లస్మయ్య, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 50 మంది యువకులు, లింగారెడ్డి పేటతండాకు చెందిన వంద మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలకు అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారన్నారు. కోటి ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలంటే మరోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరుతున్నాయన్నారు. స్థానిక నాయకులు నక్క గంగాధర్, నునుగొండ శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, బాలరాజు, రవీందర్‌గౌడ్, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదల అభ్యున్నతే కేసీఆర్ ధ్యేయం...
తాడ్వాయి: పేదల అభ్యున్నతే కేసీఆర్ ధ్యేయమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. నియోజకవర్గ ప్రజలు రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీగా గెలిపించడం ద్వారా మరోసారి కేసీఆర్‌ను సీఎంగా చేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘం సభ్యులు దాదాపు 200 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి రవీందర్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి లోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ శ్యాంరావు, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యురాలు మంజుల, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సాయిరెడ్డి, నాయకులు వెంకట్‌రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, గోపాల్‌రావు, భూషణం, శ్రీనివాస్‌గౌడ్, కిష్టారెడ్డి, రాంరెడ్డి, రాజయ్య, బాల్‌రాజ్, శ్రీనివాస్‌రెడ్డి, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ గ్రామస్తులు...
రాజంపేట్: ఎమ్మెల్యే అభ్యర్థి రవీందర్‌రెడ్డి సమక్షంలో రాజంపేట్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు 50 మంది మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కామారెడ్డిలోని ఆర్‌ఆండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణమూర్తి, జిల్లా రైతు సమన్వయ కర్త రాంరెడ్డి, నీరడి శంకర్, నాగభూషణం, రాజిరెడ్డి, వెంకట్‌రెడ్డి, సాగర్, దేవిసింగ్, రాములు, శోభన్‌బాబు, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

127
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles