అభివృద్ధి పథకాలే.. మళ్లీ గెలిపిస్తాయి


Wed,September 12, 2018 01:07 AM

నిజాంసాగర్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వ హయాంలో జుక్కల్ నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో జరిగిన అభివృద్ధి పనులు, నిరుపేదలకు అందుతున్న పథకాలను చూసి ప్రజలు మరోమారు టీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తాయని టీఆర్‌ఎస్ జుక్కల్ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్‌షిండే ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేటలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు అతిథి గృహంలో షిండే జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షిండె మాట్లాడుతూ.. రాష్ట్ర టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అండదండలతో రెండోసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నానని చెప్పారు. రూ.కోట్లు వెచ్చించి ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ రోడ్లు నిర్మించామన్నారు. నాగమడుగు ఎత్తిపోతల పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.470 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ ఎత్తిపోతల పథకంతో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. బుధవారం బిచ్కుంద మండలం గోపన్‌పల్లిలో ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి వెంకటయ్య, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నారం వెంకట్రాంరెడ్డి, సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, నాయకులు గంగారెడ్డి, పిట్లం జడ్పీటీసీ ప్రతాప్‌రెడ్డి, నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...