పోచారం నీటి విడుదలను నిలిపివేయాలి


Wed,September 12, 2018 01:07 AM

నాగిరెడ్డిపేట: మండలంలోని పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌రెడ్డికి ఆయకట్టు రైతులు వినతి పత్రం సమర్పించారు. మంగళవారం ఏ జోన్ పరిధిలోని రైతులు ఆర్డీవో కార్యాలయంలోని ఆర్‌ఐ అనిల్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం వానాకాలంలో జూలై ఆఖరులో వ్యవసాయ బోరు బావుల ఆధారంగా, ఎత్తిపోతల ద్వారా వరి పంటలు సాగు చేశామన్నారు. ప్రస్తుతం పంటలు పొట్ట దశలో ఉన్నాయని మరి కొన్ని రోజుల్లో కోత దశకు చేరుకుంటాయని అన్నారు. ఈ స్థితిలో పోచారం నుంచి నీటిని విడుదల చేయడం సరైంది కాదని వివరించారు. పోచారం నీరంతా చాలా గ్రామాల్లో వృథాగా పోయి మంజీర నదిలో కలుస్తున్నాయని అన్నారు. నీటి విడుదలతో వరి పంటలు కోత వేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. కనీసం పోచారం ప్రాజెక్టులో ఉన్న నీటిని కాపాడి యాసంగి పంటల కోసం నీటిని విడుదల చేయాలని వినతి పత్రంలో కోరారు. రైతు ప్రతినిధులు గంపల యాదగిరి, సాయిలుతో పాటు చీనూర్, వాడి, మాల్తుమ్మెద, గోలిలింగాల, పోచారం, నాగిరెడ్డిపేట, లింగంపల్లి, బంజార గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...