కాలభైరవునికి సిందూర పూజలు

Wed,September 12, 2018 01:07 AM

సదాశివనగర్ : రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి (రామారెడ్డి) శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం శ్రీ కాల భైరవునికి సిందూర పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు మూలబావి వద్ద స్నానాలు చేసి తడి బట్టలతో బావి నుంచి బిందెల్లో నీళ్లు తీసుకువచ్చి జలాభిషేకం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు స్వామి వారిని వేద పండితులు, అర్చకులు వివిధ రకాల పూలు, తమలపాకులు, నోట్ల దండలు, అప్పడాలతో స్వామి వారిని అలంకరించారు. ఆ సమయంలో భక్తులు స్వామి వారి పేర భజనలు ఓం.. భైరవ.. ఓం కాల..భైరవ.. అంటూ పాటలు పాడారు. ఆలయ చైర్మన్ గంజీ సతీశ్‌గుప్తా, ఈవో శ్రీరాం రవీందర్ పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారి మెడలో వేసెందుకు రూపాయల దండకోసం డబ్బులు కానుకగా అందజేశారు. ఆలయ ఈవో శ్రీరాం రవీందర్, ఆలయ చైర్మన్ గంజీ సతీశ్ గుప్తా ఆధ్వర్యంలో రూపాయల దండను భక్తులు లెక్కించారు. మొత్తం రూ. 5,860 ఆదాయం వచ్చిందని సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు రాచర్ల సీతారామశర్మ, రాచర్ల శ్రీనివాస్‌శర్మ, మణీష్‌శర్మ, వంశీ శర్మ, జూనియర్ అసిస్టెంట్ సురేందర్ గుప్తా, డైరెక్టర్లు బుద్ద నర్సింహులు, కందూరి చిన్న లింబాద్రి పాల్గొన్నారు.

100
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles