దాడికి పాల్పడ్డ నలుగురిపై కేసు నమోదు

Wed,September 12, 2018 01:06 AM

తాడ్వాయి: మండల పరిధిలోని కరడ్‌పల్లి గ్రామానికి చెందిన మేరుగు బాలయ్యపై దాడికి పాల్పడిన నల్గురిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై అంజయ్య తెలిపారు.ఆయన తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కరడ్‌పల్లి గ్రామానికి చెందిన బాలయ్య చర్చిలో ఫాదర్‌గా పని చేస్తూ తాడ్వాయిలో భవనం కట్టుకుంటున్నాడు. భవనానికి అనుమతి లేద ని, చర్చిని నిర్మిస్తున్నావంటూ గ్రామానికి చెందిన ము దాం నర్సింహులు, ఏనుగు రాఘవరెడ్డి, పడకంటి రాజేశ్వర్, దేమాగు శ్రీనివాస్‌రెడ్డి కలిసి సోమవారం మండ ల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో బాలయ్యపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. బాధితుడు ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మంగళవారం నల్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

104
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles