మండలానికో ఫంక్షన్ హాల్


Tue,September 11, 2018 01:29 AM

నస్రుల్లాబాద్: అన్ని వర్గాల పేద కుటుంబాలు శుభ కార్యాలు చేసుకునేందుకు మండలానికో జనరల్ ఫంక్షన్ హాళ్లను నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం వర్ని నుంచి బాన్సువాడకు వెళ్తుండగా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద నాయకులతో మాట్లాడారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లి సమావేశం నిర్వహించి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మండలానికో రూ.30 లక్షలతో జనరల్ ఫంక్షన్ హాల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయో ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ వెంటనే ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని అంకోల్ తండాలో కమ్యునిటీ హాల్ ఏర్పాటు చేశామన్నారు. మండల కేంద్రానికి ఫంక్షన్ హాల్‌ను ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, అనుమతి రాగానే పనులు ప్రారంభించుకోవాలన్నారు. మండల కేంద్రంలో గిరిజన గురుకుల పాఠశాల, గిరిజన యువజన శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం మా అదృష్టమని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, తహసీల్దార్ సంజయ్ రావు, ఎంపీడీవో హరిసింగ్, మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, ఎంపీటిసీ కంది మల్లేశ్, పార్టీ గ్రామ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ గౌడ్, మాజీ ఎంపీటీసీ మల్లేశంగౌడ్, నాయకులు సాయిరాం, సక్రు, నారాయణ, గోవర్దన్, అనీల్, సాయిలు, గంగారాం, బాలకృష్ణ, రాము, భాను, జగన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...