టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఘన స్వాగతం

Tue,September 11, 2018 01:29 AM

భిక్కనూరు: కామారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గంపగోవర్ధన్ ప్రకటించిన అనంతరం సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మండలంలోని బస్వాపూర్ వద్ద నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో అడుగుపెట్టిన గంపగోవర్ధన్ ముందుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పుజలు చేసి గ్రామశివారులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి శ్రీ పార్వతీ సిద్దరామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రానికి బైక్‌ర్యాలీతో తరలి వెళ్లారు. ర్యాలీలో ఎంపీపీ తొగరి సుదర్శన్, జడ్పీటీసీ నంద రమేశ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బాణాల సువర్ణ, డీసీసీబీ డైరెక్టర్ లింగాల కిష్టాగౌడ్, పార్టీ మండల కార్యదర్శి బాలాగౌని రాజాగౌడ్, బండి రాములు, ఎంపీటీసీ బాపురెడ్డి, తక్కళ్ల మధుసూదన్ రెడ్డి, బోయిని బలరాం, కట్టకింది రవీందర్ రెడ్డి, బాపురెడ్డి, అంబల్ల మల్లేశం, చిట్టెడి భగవంత రెడ్డి, అందె మహేందర్ రెడ్డి, దమ్మయ్యగారి సంజీవరెడ్డి, పుట్ట రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

121
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles