ఊరు మెరిసింది.. మండలం మురిసింది..!

Tue,September 11, 2018 01:28 AM

కామారెడ్డి రూరల్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగున్నరేళ్ల కాలంలో కామారెడ్డి మండలంలో ఎనలేని అభివృద్ధి జరిగింది. మండలానికి విడుదలైన నిధుల వివరాలు, సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.

మిషన్ కాకతీయ...
మిషన్ కాకతీయ మొదటి దశలో 13 చెరువులకు సంబందించిన పనులు కొనసాగాయి. వీటికి రూ.2.91 కోట్లతో పనులు చేపట్టారు. సాగుభూములకు 685 ఎకరాలకు సాగునీరు అందుతోంది. రెండోదశలో 21 చెరువులకు రూ.14.51 కోట్లతో పనులు చేపట్టారు. 2105 ఎకరాలకు సాగునీరు అందడం జరుగుతుంది. మూడోదశలో ఏడు చెరువులకు రూ.2.86 కోట్లతో పనులు ప్రారంభించారు. వీటి ద్వారా 417 ఎకరాలు సాగుభూమికి నీరు అందిస్తున్నారు. నాలుగో దశలో 7 చెరువుకులకు రూ.67.51 లక్షలతో పనులు ప్రారంభించారు. వీటి ద్వారా 179 ఎకరాలకు సాగునీరందుతోంది.

పంచాయితీ రోడ్లు
పంచాయితీ రాజ్ శాఖ ద్వారా సీఆర్‌ఆర్ నిధుల ద్వారా 6 పనులు చేపట్టారు. 9.7 కిలోమీటర్ల రోడ్డు వేశారు. ఖర్చు 3.95 కోట్లు. ఎంఆర్‌ఆర్ నిధుల ద్వారా 8 పనులు చేపట్టారు. 37.01 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. దీనికి ఖర్చు రూ.3.10 కోట్లు.

ఆసరా పెన్షన్లు...
వృద్ధాప్య పెన్షన్లు 1223, వితంతువులు 1185, వికలాంగులు 472 కల్లుగీత 41, ఒంటరి మహిళలు 158, బీడీ కార్మికులు 1841 మొత్తం 4920 మందికి నెలకు పెన్షన్లు రూ.5,42,000 అందిస్తున్నారు.

ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జీలు
కామారెడ్డి నుంచి సరంపలి, నర్సన్నపల్లికి వెళ్లే దారిలో ఈఎస్‌ఆర్ గార్డెన్ సమీపంలో ఒక బ్రిడ్జీ సరంపల్లి శివారులోని మరో బ్రిడ్జీ నిర్మాణాలకు ఒక్కోదానికి రూ.కోటి చొప్పున రెండింటికి రూ.2 కోట్లతో నిర్మాణం చేవారు. పలు గ్రామాల్లో వేసిన రోడ్లు 14.6 కిలోమీర్లకు రూ.2.27 కోట్లు ఖర్చయ్యాయి.

రుణాలు...
నిరుద్యోగ యువతకు అందజేసే రుణాలు 2014-15వ సంవత్సరానికి ఎస్సీలకు 4, బీసీలు 14, ఎస్టీలు 3, మైనార్టీలు 7 మొత్తం 28 మందికి రుణాలు అందజేశారు. 2017-18 సంవత్సరానికి ఎస్సీలు 39, ఎస్టీలు 4 మొత్తం 43 మందికి రుణాలు అందజేశారు.

రైతుబంధు పథకం...
రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున పంటల పెట్టుబడికి ప్రోత్సాహకం అందజేశారు. మండలంలో 15910 ఎకరాలకు మొత్తం రైతులు 9612 మందికి 9634 చెక్కులు అందజేశారు. వీటి విలువ రూ.6,36,41870.

రైతుబీమా...
రైతు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. దీనికి మండలంలో4712 మంది రైతులకు రైతుబీమా బాండ్లను అందజేశారు. మిగతా 60 ఏళ్లు దాటిన 3693 మంది అనర్హులు.

సబ్సిడీ విత్తనాల పంపిణీ..
రైతులకు మొక్కజొన్న, వరి, మినుములు, పెసర్లు, శనగలు, జీలుగ, పెద్ద జనుములు తదితర విత్తనాలు సబ్సిడీ ద్వారా అందించేందుకు 2016-17 సంవత్సరంలో 12002 మంది రైతులకు రూ.2,27,905 విత్తనాలకు రైతులకు రూ.6,0379 సబ్సిడీ రైతులకు అందజేశారు. 2017-18 సంవత్సరానికి రైతులకు రూ.28,82,838 లక్షల విత్తనాలు సబ్సిడీపై 966 మందికి అందజేశారు.

గొర్రెల పంపిణీ...
కామారెడ్డి మండలంలో మొదటి విడతలో 336 మంది గొల్లకుర్మలను గుర్తించడం జరిగింది. వీరికి 7056 గొర్రెలు పంపిణీ చేశారు. రెండో విడతలో పంపిణీ చేయడగానికి అర్హులను గుర్తించారు. గేదెల పంపిణీ కోసం ఇప్పటి వరకు 713 మంది అర్హులను గుర్తించడం జరిగింది. వీరికి త్వరలో గేదెలు పంపిణీ చేస్తారు.

అంగన్‌వాడీ భవనాలు..
మండలంలోని ఉగ్రవాయిలో 2, శాబ్దిపూర్‌లో 2, అడ్లూర్‌లో 1, టేక్రియాల్‌లో 1 క్యాసంపల్లిలో 1 మొత్తం 7 అంగన్‌వాడీ భవనాలు నిర్మించారు. వీటికి రూ.45, 50,000 ఖర్చు చేశారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం..
మండలంలోని ఇల్చిపూర్‌లో 50, టేక్రియాల్‌లో 50, నర్సన్నపల్లిలో 50, క్యాసంపల్లిలో 30, తిమ్మక్‌పల్లిలో 30, లింగాయపల్లిలో 40, చిన్నమల్లారెడ్డిలో 40 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పనులు చివరి దశలో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి.

117
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles