ఐలమ్మ ధైర్య సాహసాలు మరువలేనివి

Tue,September 11, 2018 01:28 AM

ఎల్లారెడ్డి రూరల్ : పండించిన ధాన్యాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చిన రజాకార్లను ధైర్యసాహసాలతో తరిమేసిన ఘనత చిల్యాల చాకలి ఐలమ్మదని మండల రజకసంఘం అధ్యక్షుడు అయ్యన్న సాయిప్రసాద్ అన్నారు. సోమవారం పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద 33వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఆమె పోరాట పటిమను జ్ఞాపకం చేసుకున్నారు. నిరుపేదలకు అండగా నిలు స్తూ కుల,మత బేధం లేకుండా పేదలందరికి నాయకురాలై ముందుండి నైజాం ప్రభుత్వానికి సవాలుగా ఐలమ్మ నిలిచి చరిత్రలో స్థానం దక్కించుకుందన్నారు. కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు బంజపల్లి రాములు, అయ్యన్నబాలయ్య, గోపాల్, సత్యం, శివ, రవి, నాగరాజు, గంగవ్వ, రాణి, అం జయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

గాంధారిలో..
గాంధారి : మండల కేంద్రంలో సోమవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక కులస్తులు నిర్వహించారు. నెహ్రూవిగ్రహం వద్ద ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా రజక కులసంఘం నాయకుడు బుర్రి సంజీవులు మాట్లాడుతూ తెలంగాణ సాయుదపోరాటంలో చాకలిఐలమ్మ చూపిన తెగువ, ధైర్యసాహసాలు మరచిపోలేనివని అన్నారు. రజక కులస్తులకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింస్తున్నారంటే కేవలం చాలకలిఐలమ్మ పుణ్యమేనని అన్నారు. కార్యక్రమంలో రజక కులసంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

తాడ్వాయిలో..
తాడ్వాయి: మండల పరిధిలోని గ్రామాల్లో సోమవారం చాకలి ఐలమ్మ వర్థ్ధంతిని రజక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్రాహ్మణపల్లిలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహనికి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు మిడిదొడ్డి స్వామి, కోశాధికారి నారాయణ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఐలమ్మ స్ఫూర్తితో రజకులు అందరు కలిసి సమస్యల సాధనకు ముందుకు రావాలని అన్నారు. రజక భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ఎకరం స్థలం కోటి రూపాయలు మంజూరు చేశారని అన్నారు. రజక యువకులకు రుణాలు ఇవ్వడానికి కేసీఆర్ సముఖతను వ్యక్తం చేశారని అన్నారు. పేద ప్రజల కోసం ఐలమ్మ చేసిన పోరాటం గురించి పలువురు వివరించారు.కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మి,మిల్క్‌సెంటర్ అధ్యక్షుడు సాయిరెడ్డి,మాజి సర్పంచి రాజయ్య,రజక సంఘం నాయకులు దేవయ్య,పోశయ్య, గంగయ్య ,బాల య్య, స్వామి, భిక్షపతి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

96
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles