స్పెషల్ సమ్మరీ రివిజన్‌ను నిలిపి వేయాలి

Mon,September 10, 2018 01:12 AM

కామారెడ్డి/నమస్తే తెలంగాణ : రాష్ట్ర లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ గడువు కన్నా ముందుగానే ముగిసినందున భారత ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 (2) అనుసరించి సుప్రీం కోర్టు పొందుపరిచిన ప్రత్యేక రెఫరెన్స్ నంబర్ 1/2002 ద్వారా రాష్ట్రంలో 1-1-2019 ప్రాతిపదికన కొనసాగుతున్న స్పెషల్ సమ్మరీ రివిజన్‌ను ఫొటో ఎలక్ట్రోల్‌లను వెంటనే నిలిపి వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1-1-2018 ప్రాతిపదికన రెండో స్పెషల్ సమ్మరి రివిజన్ దిగువ తేదీల్లో చేపట్టాలన్నారు. 10-9-2018న సమీకృత ఎలక్ట్రోల్ డాటాను ప్రచురించాలని, 10-09-2018 నుంచి 20-09-2018 వరకు క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ పూర్తి చేయాలని అన్నారు. 15,16వ తేదీల్లో గ్రామ సభ, లోకల్ బాడీ ఆర్‌డబ్ల్యూఏఎస్ క్యాంపియన్ చేపట్టాలని అన్నారు. 4-10-2018లో క్లెయిమ్స్ తిరస్కరణలను పరిష్కరించాలన్నారు. 7-10-2018న ప్రింటింగ్, 8-10-2018 న ఎలక్ట్రోల్ చివరి సారిగా ప్రచురించాలని పేర్కొన్నారు.

115
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles