కాళోజీ ఆశయ సాధనకు కృషి


Mon,September 10, 2018 01:12 AM

విద్యానగర్ : ప్రతీ గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ కోరిక అని, జిల్లాలోని ప్రతీ మండలానికి గ్రంథాలయం ఏర్పాటు చేస్తూ ఆయన ఆశయాలను సిద్ధింపజేస్తున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు. కాళోజీ నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని ఆదివారం జిల్లా గ్రంథాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కాళోజీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం కవిత్వం రాసిన కవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు అని అన్నారు. పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అన్న కాళోజీని స్ఫూర్తిగా తీసుకొని తోచిన రీతిలో సమాజానికి సేవ చేయడమే ఆయనకు సమర్పించే నిజమైన నివాళి అని అన్నారు. తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమంలో కాళోజీ ప్రతిధ్వనింపబడ్డారని, తన కవితల ద్వారా ఆలోచనలు రగిలించారని అన్నా రు.

తెలంగాణలో అక్షర జ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరని అన్నారు. అనేక అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించిందని గుర్తుచేశారు. అనంతరం ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత అంబీర్ మనోహర్ రావును కాళోజీ పురస్కారంతో సత్కరించారు. కవులు, రచయితలు, క ళాకారులకు శాలువాలు కప్పి మెమోంటోలతో సన్మానిం చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంపత్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకుడు మామిండ్ల అంజయ్య, డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ, ఆర్డీవో రాజేంద్రకుమార్, తహసీల్దార్ రవీందర్, సిబ్బంది, విద్యార్థులు తదితరు లు పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...