విజేతలకు బహుమతుల ప్రదానం

Mon,September 10, 2018 01:12 AM

నిజామాబాద్ స్పోర్ట్స్ : జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాయామ ఉపాద్యాయుల క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. శనివారం రాత్రి నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో జరిగిన వ్యాయామ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన సభలో భాగంగా జరిగిన ముగింపు కార్యక్రమానికి సంఘం చైర్మన్ ఈగ సంజీవ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల వ్యాయామ ఉపాధ్యాయులను ఏకతాటిపైకి తెచ్చి వారిలో నూతనోత్సహాన్ని నెలకొల్పే ఆలోచనతో మొదటిసారిగా వివిధ క్రీడాంశాల్లో వారికి పోటీలను నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయులను మహిళలు, పురుషులకు వేర్వేరుగా త్రోబాట్, వాలీబాల్, క్రికెట్ పోటీలను నిర్వహించారు. మహిళల విభాగంలో ఐదు జట్లు, పురుషుల విభాగంలో 8 జట్లుగా విభజించి నిర్వహించిన ఈ పోటీలలో ఆయా జట్లకు తమ పేర్లతో నామకరణం చేశారు.

ఉత్సాహంగా పాల్గొని పోటీల్లో గెలుపొందినవారికి వ్యక్తిగత పతకాలు, ట్రోఫీలను బహూకరించారు. అనంతరం పాల్గొన్న క్రీడాకారులందరినీ అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో క్రీడాకారులను తీర్చిదిద్ది జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.అనిల్, టి.విద్యాసాగర్‌రెడ్డి, జిల్లా పేటా సంఘం ముఖ్య సలహాదారులు మంథని రాజేందర్‌రెడ్డి, ఎన్‌జీఎస్ డైరెక్టర్ క్యాతం సంతోష్‌కుమార్, జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.అనిల్, టి.విద్యాసాగర్‌రెడ్డి, కోశాధికారి బద్దం గోపిరెడ్డి, మహిళా విభాగం ప్రతినిధి శారద, మాజీ అధ్యక్షులు లింగయ్య, మైనేని సుబ్బారావు, మహ్మద్ అన్వర్, గొట్టిపాటి నాగరాజు, తెలంగాణ రాష్ట్ర పేటా సంఘం అసోసియేట్ అధ్యక్షులు రంగ వెంకటేశ్వర్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల ఎస్‌జీఎఫ్ నిర్వహణ కార్యదర్శులు పవన్‌కుమార్, వెంకట్, తెలంగాణ పేటా సంఘం కార్యదర్శి పింజ సురేందర్, డి.సురేందర్, డాక్టర్ స్వామికుమార్, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

107
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles