టీఆర్‌ఎస్ హయాంలోనే దేవాలయాల అభివృద్ధి


Sun,September 9, 2018 01:23 AM

నస్రుల్లాబాద్ : టీఆర్‌ఎస్ హయాంలోనే దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లోని పలు ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. బీర్కూర్ గ్రామ పోలీసుస్టేషన్ సమీపంలో ఉన్న జోడి లింగాల శివాలయంలో పూజలు చేశారు. అనంతరం తెలంగాణ తిరుమల దేవస్థానం, సోమేశ్వరాలయాలను దర్శించుకున్నారు. మంత్రి తనయుడు పోచారం సురేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. దూప దీప నైవేద్యం కింద 3 వేల దేవాలయాలకు ఒక్కొక్క ఆలయానికి రూ.6 వేలు మంజూరు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో 32 మంది అర్చకులకు ధ్రువపత్రాలు అందించారు. రాష్ట్రంలోనే ఈ కార్యక్రమం ఇక్కడే ప్రారంభించామన్నారు. బలహీన వర్గాల కాలనీల్లో ఉన్న ఆలయాల అభివృద్ధి, నిర్మాణం కోసం నియోజకవర్గంలో 30 ఆలయాలకు రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు తెలిపారు. బీర్కూర్ గ్రామంలో పలు కుల సంఘాలకు కమ్యునిటీ హాల్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...