బీజేపీ నాయకుల తొలగింపు


Sun,September 9, 2018 01:22 AM

విద్యానగర్ : జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ నియమాలు పాటించకుండా, క్రమశిక్షణ రహితంగా వ్యవహరించిన బీజైవైఎం జిల్లా అధ్యక్షుడు జూలూరి సుధాకర్, పట్టణ అధ్యక్షుడు చింతల రమేశ్, పార్లమెంట్ కో కన్వీనర్ అర్కల ప్రభాకర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తునికి వేణు, జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డిని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. వారి సభ్యత్వాలను రద్దు చేయాలని జాతీయ కార్యాలయానికి సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. వీరి స్థానంలో బీజేవైఎసం జిల్లా అధ్యక్షుడిగా నరేందర్, పట్టణ అధ్యక్షుడిగా కుంట లకా్ష్మరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బుర్రి రవి, బీజేవైఎం మహిళా అధ్యక్షురాలిగా పుల్లూరి జ్యోతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా అరుణ కుమారిని ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ అభివృద్ధి కమిటీ చైర్మన్ మురళీధర్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్న రాజులు, తేలు శ్రీనివాస్, మోతీరాం, సుజాత, సాయిరెడ్డి, తుమ్మ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...