అంతర్జాతీయ అథ్లెటిక్‌లో బంగారు పతకం సాధించిన అజయ్ కుమార్


Sun,September 9, 2018 01:22 AM

బాన్సువాడ రూరల్ : గత నెల 29 నుంచి నేపాల్‌లో కొనసాగిన అంతర్జాతీయ అండర్ - 17 అథ్లెటిక్ పోటీల్లో తాడ్కోల్ గ్రామానికి చెందిన అజయ్‌కుమార్ బంగారు పతకం సాధించాడు. శనివారం తాడ్కోల్ గ్రామానికి చేరుకోగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అథ్లెటిక్ 3 కి.మీ.ల విభాగంలో గోల్డ్‌మెడల్, 800 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ పతకం సాధించాడు. పోటీలు ముగించుకొని గ్రామానికి తిరిగి వచ్చిన అజయ్‌కు గ్రామస్తులు బాన్సువాడ పట్టణం నుంచి భారీ ఊరేగింపుతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బంగారు, వెండి పతకం సాధించడం దేశానికి, రాష్ర్టానికి గర్వకారణమని గ్రామ మాజీ సర్పంచ్ గంగుల గంగారాం అన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. మరింత పట్టుదలతో ముందుకు వెళ్లి వచ్చే ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆక్షాంక్షించారు. అనంతరం అజయ్, కోచ్ రవిలను గజమాలతో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గ్రామానికి చెందిన యూత్ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని అజయ్‌కి శుభాక్షాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు వెంకట్‌రెడ్డి, వజ్రేశ్వర్, మధుసూదన్‌రెడ్డి, క్రీడాకారుడి తల్లిదండ్రులు జయశ్రీ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...