ప్రచారం ప్రారంభం


Sat,September 8, 2018 01:06 AM

సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థులను గురువారం ప్రకటించడంతో శుక్రవారం ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి- మంజుల దంపతులు రెండు వేల మంది కార్యకర్తలతో కలిసి రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బాణా సంచాకాల్చారు, సాయంత్రం ఎల్లారెడ్డి నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముందుగా శ్రీ కాల భైరవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఇసన్నపల్లిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, తిలకం దిద్దారు. చక్కెర తినిపించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధిలో ముందుంచినట్లు తెలిపారు. సీఎం సహాయంతో రామారెడ్డి మండలాన్ని ఏర్పాటు చేశానన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. త్వరలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు.

గ్రామాలను అభివృద్ధి చేయని కాంగ్రెస్ వారు ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి రవీందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించడంతో ఏడు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కార్యక్రమంలో శ్రీకాల భైరవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గంజి సతీశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎదురుగట్ల సంపత్‌గౌడ్, జడ్పీటీసీ రాజేశ్వర్‌రావు, ఎంపీపీ బంజే విజయ, మండల అధ్యక్షుడు నారెడ్డి రాజిరెడ్డి, గడీల భాస్కర్, ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ గుర్జాల నారాయణరెడ్డి, విండో అధ్యక్షుడు దశరథ్ రెడ్డి, నాయకులు నక్క గంగాధర్, నునుగోండ శ్రీనివాస్, ముకుంద్‌రావు, శివాజీరావు, తాన్‌సింగ్, బోరింగ్ రాంరెడ్డి, పైడి సంతోష్ రెడ్డి, మర్రి సదాశివరెడ్డి, ఇర్షాద్, ఎండ్రియాల రాజేందర్ గౌడ్, బానురి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...