ఎన్నికలకు సిద్ధం

Sat,September 8, 2018 01:06 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ: పోరాడి సాధించుకున్న తెలంగాణను అనతి కాలంలోనే కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి మరోసారి ప్రజల తీర్పుకోసం ప్రజల ముందుకు ముందస్తుగా వెళ్తున్నామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనని, రాష్ట్రంలో 105 అసెంబ్లీ స్థానాలుపు ఖాయమన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన బాన్సువాడలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము భయపడేది లేదన్నారు. అభివృద్ధి అంటేనే తెలియని ప్రతిపక్ష పార్టీలకు ముందస్తు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

రూ. 6వేల కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి...
బాన్సువాడ నియోజకవర్గాన్ని రూ. 6వేల కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. బాన్సువాడ సమీపంలో 220/ 33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నామని, కోటగిరి మండలంలో 122/ 33 కేవీ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేశామని చెప్పారు. నియోజకవర్గంలోని ఇంటింటికీ నల్లానీరు అందంజేసేందుకు రూ. 500 కోట్లతో పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. సోమలింగేశ్వర ఆలయాని వెళ్లే దారిని డబుల్ రోడ్డుగా చేసేందుకు, టాయిలెట్స్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఆలయాన్ని దర్శనీయ స్థలంగా తీర్చిదిద్దేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం శ్రీ రాంనారాయణ ఖేడియా అప్పట్లోనే రూ. 8 లక్షలు విరాళమిచ్చారని, మరో రూ. రెండు లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. బోర్లం బసవేశ్వరాలయం సమీపంలో బ్రిడ్జి నిర్మాణానికి నిధుల మంజూరు ఇచ్చినట్లు గుర్తు చేశారు.

ఫంక్షన్‌హాళ్లకు రూ. 7 కోట్ల 52 లక్షలు..
నియోజకవర్గంలోని బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండల కేంద్రాల్లో ఆయా గ్రామాల పేదలు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు జనరల్ ఫంక్షన్ హాళ్లు నిర్మించనున్నామని, అందుకోసం రూ. 7 కోట్ల 52 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. వీటితో పాటు వివిధ గ్రామాల్లో సంఘ భవనాల కోసం మంజూరు చేసిన నిధుల వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, బంజార సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్, సొసైటీ అధ్యక్షుడు ఎర్వాల కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ నార్ల సురేశ్‌గుప్తా, మాజీ ఎంపీపీ గంగాధర్, మహ్మద్ ఏజాస్, కొత్తకొండ భాస్కర్, గురు వినయ్‌కుమార్, దాసరి శ్రీనివాస్, నార్ల ఉదయ్, బంజారా సంఘం మండల అధ్యక్షుడు రాము రాథోడ్, రవి, అంబర్‌సింగ్, సత్యనారాయణ, మోచి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ లౌకికవాది..
ప్రపంచ శాంతి కోసం ప్రార్థించే అన్ని మతాలు, వర్గాలను గౌరవించే సీఎం కేసీఆర్ లౌకికవాది అని మంత్రి పోచారం కొనియాడారు. శుక్రవారం సాయంత్రం బాన్సువాడ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో ఇమాములు, మౌజాముల కృతజ్ఞత సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని పూల మాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మైనార్టీశాఖను తనవద్దే ఉంచుకొని గతంలో ఏ ప్రభుత్వాలు ఆదరించని విధంగా ఈద్గాలు, కబ్రస్తాన్ తదితర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఇమాములు, మౌజాములు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో వారి గౌరవ వేతనాన్ని రూ. 1500 నుంచి రూ. 5 వేలకు పెంచారని అన్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇమామ్ గులాం యజ్‌ధాని మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు ప్రేమానురాగాలు, ఆత్మీయంగా ఉండాలన్నదే హిందుస్తాన్ సారంశమన్నారు. ముక్తి ఉమర్, కవి చావూస్, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ సాలంబిన్ అలీ, మహ్మద్ ఏజాస్, మండల కోప్షన్ సభ్యుడు అక్బర్, జెడ్పీ కోప్షన్ సభ్యుడు అలీమొద్దీన్ బాబా పాల్గొన్నారు.

101
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles