ఆ నలుగురే..

Fri,September 7, 2018 01:10 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ తెలంగాణ : రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర పుటల్లో తమకంటూ పేజీలు లిఖించారు అపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. ఉద్యమ నాయకుడిగా తనదైన శైలిలో చరిత్రాత్మకమైన నిర్ణయాలను తీసుకుంటూ ఆంధ్రా పార్టీల మెడలు వంచారు ఉద్యమ సారథి. యూపీఏ సర్కారును ఒప్పించి, ఎన్నో త్యాగాలు, మరెన్నో పోరాటలతో 2014, జూన్ 2 నాడు ఆరు దశాబ్దాల స్వరాష్ట్రం సాకారమైంది. తెలంగాణ నూతన రాష్ర్టానికి ఉద్యమ సారథే ప్రజల మనసులు గెలిచి ముఖ్యమంత్రిగా నిలిచారు. ఇప్పుడాయనే మరో సంచలనాత్మక నిర్ణయం ప్రకటించి రాజకీయ ఉద్దండులకు, ప్రతిపక్ష పార్టీలకు భారీ సవాల్ విసిరారు. పసలేని ఆరోపణలు, కల్లిబొల్లి మాటలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తోన్న దుష్ట శక్తుల పీచమనచడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా క్యాబినెట్ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపగా అసెంబ్లీని గురువారం రద్దు చేశారు. సాహసోపేత నిర్ణయంతో ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల బరిలో నిలిచారు. త్వరలోనే జరుగబోయే ఎలక్షన్‌లో తమ అభ్యర్థుల ఎంపికలో గులాబీ అధినేత పనితనానికి పట్టాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లాలో నాలుగు శాసనసభ స్థానాలున్నాయి.

ఇందులో అందరూ సీనియర్ ఎమ్మెల్యేలే కావడం విశేషం. వీరంతా కేసీఆర్ సారథ్యంలో నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. సీనియర్ మంత్రిగా పోచారం శ్రీనివాస రెడ్డి సలహాలు, సూచనలతో సమన్వయం చేసుకుంటూ కొత్త జిల్లా కామారెడ్డిని రాష్ట్రంలో ముందుంచారు. సమీప భవిష్యత్తులో రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్‌లకే అభ్యర్థిత్వాలు ఖరారు చేశారు. దీంతో జిల్లా అంతటా జోష్ ఏర్పడింది. క్యాడర్‌లోనూ ఉత్సాహం రెట్టింపు అయ్యింది. అసంతృప్తులన్నదే లేకుండా చక్కని సమన్వయంతో జిల్లాలో ఐక్యంగా ఎన్నికలను ఎదుర్కొనేలా ప్రణాళికలు రచించారు. అభ్యర్థిత్వాలు ఖరారైన వారిలో పోచారం శ్రీనివాస రెడ్డి సీనియర్ మంత్రిగా సేవలందించారు. ప్రభుత్వ విప్‌గా గంప గోవర్ధన్ తనదైన శైలిలో నియోజకవర్గంలో దూసుకుపోయారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ గడపగడపకూ టీఆర్‌ఎస్ పథకాలను అందించడంలో ఏనుగు రవీందర్ రెడ్డి రాకెట్ వేగంతో చొచ్చుకెళ్లారు. వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గాన్ని సమతుల్యంగా అభివృద్ధి పర్చడంలో, భారీ నీటి పారుదల ప్రాజెక్టుకు రూపకల్పన చేయడంలో సఫలమై హన్మంత్ షిండే సైతం అందరి చూపులను ఆకట్టుకున్నారు. ఇలా జిల్లాలోని నలుగురు ప్రజా ప్రతినిధులు తమ పనితనంతో అధినేతను ఆకట్టుకుని భవిష్యత్తు ఎన్నికలకు సై అంటూ బరిలో నిలిచారు.

బాన్సువాడ నియోజకవర్గం
పేరు : పరిగే శ్రీనివాస రెడ్డి
తండ్రి పేరు : పరిగె రాజారెడ్డి
తల్లి : పాపమ్మ
భార్య : పరిగె పుష్పమ్మ
చదువు : (బీఈ)
పుట్టిన తేది : 10.02.1949
సంతానం : పరిగె రవీందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అరుణ
స్వగ్రామం : పోచారం (బాన్సువాడ మండలం)
- 1976లో పరిగె శ్రీనివాస రెడ్డిగా రాజకీయ ఆరంగేట్రం ప్రారంభించారు.
- 1977లో సొసైటీ డైరెక్టర్(ఎల్‌ఎంబీ)గా పోటీ చేసి చేశారు. 1978లో బాన్సువాడ సమితికి పోటీ చేసి ప్రత్యర్థి ఆర్.వెంకట్రామ్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు.
- 1987లో బుడ్మి,(తాడ్కోల్) అధ్యక్షుడిగా ఎన్నికై, ఎన్‌డీసీసీబీ చైర్మన్ అయ్యారు.
- 1988లో టీడీపీ జిల్లా అధ్యక్షడిగా పని చేశారు.
- 1989లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ప్రత్యర్థిబాలాగౌడ్ చేతిలో ఓటమి,
- 1992లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు.
- 1993లో నిజామాబాద్ జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు.
- 1994లో బాన్సువాడ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
- 1995లో టీడీపీ జిల్లా కన్వీనర్‌గా విధులు చేపట్టారు.
- 1998లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.
- 1999 భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది భూగర్భ గనుల శాఖ మంత్రిగా పనిచేశారు.
- 2000 సంవత్సరంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.
- 2002లో మంత్రి పదవికి రాజీనామ చేశారు.
- 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున బాజిరెడ్డి గోవర్ధన్ తోచేతిలో ఓటమి,
- 2005, 2007 వరకు జిల్లా టీడీపీ కన్వీనర్‌గా నియామకం.
- 2009సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడే ప్రారంభమైన తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ తెలంగాణపై ద్వంద్వ వైఖరికి నిరసనగా ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేశారు.
- 2011 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియామకం,
- 2011 ఉప ఎన్నికల్లో ఎమ్యెల్యేగా గెలుపొందారు.
- 2014లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వ్యవసాయ, సహకార శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం బాన్సువాడ నుంచి బరిలో ఉన్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గం
పేరు : ఏనుగు రవీందర్ రెడ్డి
తల్లి దండ్రులు : ఏనుగు రాజారెడ్డి, రాజమ్మ
పుట్టిన తేది : 5.4.1965,
గ్రామం : ఎర్రాపహాడ్, తాడ్వాయి మండలం,
ప్రాథమిక విద్య : ఎర్రాపహడ్ (పదో తరగతి వరకు)
ఇంటర్మీడియెట్ : ప్రభుత్వ జూనియర్ కాలేజి (1984), నర్సాపూర్, మెదక్.
డిగ్రీ : ప్రభుత్వ డిగ్రీ కాలేజి,
కామారెడ్డి.
ఎస్‌ఐటీసీ : గాంధీ వైద్యశాల (1986), హైదరాబాద్.
వృత్తి : వ్యవసాయం, 13 ఏళ్లు కంటోన్మెంట్‌లో శానిటరి ఇన్‌స్పెక్టర్.
భార్య : మంజులారెడ్డి
కొడుకు, కోడలు : ఏనుగు నిఖిల్ రెడ్డి, రీచారెడ్డి.
కూతురు : వైష్ణవి.
- 2004లో...ఏనుగు రవీందర్ రెడ్డి (టీఆర్‌ఎస్) బి. జనార్దన్ గౌడ్ (ఇండిపెండెంట్), జాజాల సురేందర్ (ఇండిపెండెంట్)-రవీందర్ రెడ్డి విజయం.
- 2008లో...ఏనుగు రవీందర్ రెడ్డి (టీఆర్‌ఎస్), బి. జనార్దన్ గౌడ్ ( కాంగ్రెస్).-బి. జనార్ధన్ గౌడ్ విజయం.
- 2009లో...ఏనుగు రవీందర్ రెడ్డి (టీఆర్‌ఎస్), బి. జనార్దన్ గౌడ్ (కాంగ్రెస్)పై రవీందర్ రెడ్డి విజయం.
- 2010లో...ఏనుగు రవీందర్ రెడ్డి (టీఆర్‌ఎస్), షబ్బీర్ అలీ (కాంగ్రెస్)పై రవీందర్ రెడ్డి విజయం.
- 2014లో...ఏనుగు రవీందర్ రెడ్డి (టీఆర్‌ఎస్), జాజాల సురేందర్ (కాంగ్రెస్)పై రవీందర్ రెడ్డి విజయం.
- ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 105 మంది తొలి జాబితాలో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి మరోసారి టికిట్ దక్కించుకున్నారు.

రాష్ట్రంలో తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా...
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పలు శాఖలకు మం త్రిగా పని చేశాను. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ లేని సంతృప్తి, ఆనందం నాకు స్వరాష్ట్రంలోనే కలిగింది. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సా రథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్యాబినెట్‌లో నాకు అవకాశం దొరకడం అదృష్టంగానే భావిస్తున్నాను. అందులో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసే అవకాశం కల్పించడమూ చాలా ఆనందంగా ఉంది. గడిచిన నాలుగున్నరేళ్లలో కేసీఆర్ సారథ్యంలో అనేక వినూత్న పథకాలను తీసుకు వచ్చాం. రైతులకు ఏ ప్రభుత్వం చేయని విధంగా మేలైన పథకాలు తీసుకు వచ్చాం. రైతుబంధు, రైతుబీమా, భూ రికార్డుల ప్రక్షాళన, సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు అమలు చేశాం. మా పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. వచ్చే ఎన్నికల సమరానికి సన్నద్ధంగా ఉన్నాం. ప్రజా మద్ధతుతో భారీ మెజార్టీతో గెలుపు సొంతం చేసుకుంటాము. తొలి ప్రభుత్వంలో బాన్సువాడకు తొలి ఎమ్మెల్యేగా, రాష్ర్టానికి తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేయడం నిజంగా అదో మరిచిపోలేని అనుభూతి.
- పోచారం శ్రీనివాస రెడ్డి, అపద్ధర్మ మంత్రి

కామారెడ్డి నియోజకవర్గం
పేరు : గంపగోవర్ధన్
తండ్రి పేరు : వెంకయ్య
తల్లి : రాజమ్మ
భార్య : రాణి,
కుమారుడు : శషాంక్, కూతరు : సుష్మ
స్వగ్రామం : బస్వాపూర్, మండలం భిక్కనూరు .
పుట్టిన తేది : 06.02.1963
విద్యా అర్హత : బీఏ
చదివిన కళాశాల : ప్రభుత్వ సిటీ కాలేజ్ హైదరాబాద్
- 1985 లో టీడీపీ కార్యకర్తగా చేరారు.
- 1987లో బస్వాపూర్ సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నిక.
- 1987-94 లో టీడీపీ మండలాధ్యక్షుడిగా ఎంపిక
- 1994-99 టీడీపీ ఎమ్మేల్యేగా కామారెడ్డి నుంచి గెలుపొందారు.
- 1999-2001 ఉమ్మడి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారు.
- 2007-09 స్టేట్ సెక్రటరీగా టీడీపీలో పని చేశారు.
- 2009 నుంచి 2011 వరకు రెండో సారి టీడీపీ ఎమ్మేల్యేగా గెలుపొందారు.
- 2011 నుంచి 2013 వరకు టీఆర్‌ఎస్ ఎమ్యేల్యేగా గెలుపొందారు.
- 2014లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టారు.
- ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.

అధినేత బాటలో విజయ భేరి మోగిస్తాం...
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ బాటలో మేమంతా నడుస్తాం. ఆయన మార్గదర్శకత్వంలో ప్రజల ముందుకు వెళ్లబోతున్నాము. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పథకాలను ఇంటింటికీ తీసుకు పోయాము. కామారెడ్డి జిల్లా ఏర్పాటు, మున్సిపాలిటీ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేకూర్చిన లబ్ధి అంతా ఇంతా కాదు. అసెంబ్లీ రద్దుతో మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం గులాబీ పార్టీదే. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా పనిచేయడం ఓ చారిత్రాత్మకం. తొలి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పని చేయడమూ మరుపురానిది. ఇప్పటి వరకు చేసిన పనులను, అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతాం. వారి అండతో మరోమారు ప్రభుత్వంలోకి తప్పక వస్తాం.
- గంప గోవర్ధన్,
కామారెడ్డి తొలి ఎమ్మెల్యే(తెలంగాణ రాష్ట్రంలో)

116
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles