ఉపాధి హామీలో జిల్లాకు అవార్డు గర్వకారణం

Fri,September 7, 2018 01:09 AM

కామారెడ్డి, నమస్తేతెలంగాణ : ఉపాధి హామీ పనుల్లో జిల్లాకు జాతీయ అవార్డు రావడం హర్షణీమని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఈ అవార్డు కోసం దేశంలోని 18 జిల్లాలను ఎంపిక చేయగా అందులో కామారెడ్డి ఒకటి కావడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ నెల 11 ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేస్తారని తెలిపారు. కలెక్టరేట్‌లోని జనహిత భవన్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉపాధి హామీ సిబ్బందితో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మండలాల వారీగా పనులను సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కోటీ 32 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ధేశించుకోగా ఇప్పటి వరకు కోటీ 5 లక్షల 98 వేల 294 మొక్కలు నాటి 87 శాతం పూర్తి చేసుకున్నామన్నారు. రోజూ మూడు లక్షల మొక్కలు నాటి అలసత్వం లేకుండా ఈ నెల 15 లోగా లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు సూచించారు. ప్లాంటేషన్‌తో పాటు జియో ట్యాగింగ్ వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో తప్పని సరిగా పీడీ అకౌంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పాఠశాలల్లో టాయిలెట్స్, కిచెన్ షెడ్స్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిలన్నారు. కార్యక్రంమలో డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, ఏపీడీ సాయన్న పాల్గొన్నారు.

91
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles