పలు అభివృద్ధి పనులు ప్రారంభం..


Wed,September 5, 2018 11:57 PM

కామారెడ్డి నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 2.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రోడ్ల భవనాల శాఖ నూతనంగా అతిథి గృహం నిర్మాణ పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు. కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్ముల తిరుమల రెడ్డి, జేసీ యాదిరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, మున్సిపల్ చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మ, ఆర్డీవోలు రాజేశ్వర్, దేవేందర్‌రెడ్డి, రాజేంద్రకుమార్, తహసీల్దార్ రవీందర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ అంజయ్య, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ సిద్దిరాములు, ఎంపీపీ మంగమ్మ, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి విఠల్‌రావు తదిరతులు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...