గురువుల కృషితోనే బంగారు భవిష్యత్తు

Wed,September 5, 2018 11:57 PM

విద్యానగర్: గురువుల కృషితోనే విద్యార్థుల భవిష్యత్తు బంగారు మయం అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఈఎస్‌ఆర్ గార్డెన్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతర్జాతీయ ప్రశంసలు పొందిన తత్వవేత్త, విద్యావేత్త, మేధావి, రాజనీతిజ్ఞుడని కొనియాడారు. ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొవడం ఆనందంగా ఉందన్నారు. విద్యారంగంలో ఆయన చేసిన కృషి ఎంతో ఉందని, ఆయన ఆశయాల గురించి బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో వాత్సల్యం కలిగి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేసి విద్యార్థు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తున్నట్లు వివరించారు. అనంతరం 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, ఎంపీ బీబీపాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదర్‌రాజు, కలెక్టర్ సత్యనారాయణ, జేపీ యాదిరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, మున్సిపల్ చైర్ పర్సన్ పిప్పిరి సుష్మ వెంకటి, ఆర్డీవో రాజేశ్వర్, దేవేందర్‌రెడ్డి, రాజేంద్రకుమార్, డీఈవో రాజేశ్, తహసీల్దార్ రవీందర్, ఎంపీపీ మంగమ్మ పాల్గొన్నారు.

116
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles