పాడి పశువుల పంపిణీలో పొరపాట్లకు తావివ్వొద్దు

Wed,September 5, 2018 11:57 PM

కామారెడి, నమస్తే తెలంగాణ: రైతులకు అందించే పాడి పశువుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని జిల్లా పశుసంవర్ధక, పశు వైద్య సిబ్బందికి కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. బుధవారం జనహిత భవన్‌లో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి పశు వైద్యులు, అసిస్టెంట్ డైరక్టర్లు, డెయిరీ సొసైటీ అధ్యక్షుల పాడి పశువుల పంపిణీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పశువుల పంపిణీలో చిన్న పొరపాటు కూడా జరుగకుండా చూసుకోవాలని అన్నారు. పాడి పశువులు తీసుకునే రైతు సంతృప్తి చెందాకే కొనుగోలు చేయాలని, దీనికి లబ్ధిదారుడి నుంచి సమ్మతి లేఖను తీసుకోవాలన్నారు. కొనుగోలు అనంతరం పెంపకం విషయంలో అన్ని సూచనలు అందించాలని అన్నారు. జిల్లాకు మొత్తం 11,783 యూనిట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 391 యూనిట్లు గ్రౌండింగ్ చేశామని, రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. యూనిట్ ధర రూ. 80 వేలకు గాను ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 75 శాతం సబ్సిడీపై, ఇతరులకు 50 శాతం సబ్సిడీపై అందజేస్తున్నట్లు తెలిపారు. పశువులతో పాటు 300 కిలోల దాణా, మూడేళ్ల పాటు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరక్టర్ డాక్టర్ రమేశ్, డెయిరీ మేనేజర్ ప్రదీప్, చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

109
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles