ఊరూరా రైతు వేదికలు

Thu,December 5, 2019 03:45 AM

-ప్రతీ క్లస్టర్‌కో భవనం
-ఒక్కో భవనానికి రూ.15లక్షలు
-జిల్లా వ్యాప్తంగా 98 క్లస్టర్లు
-స్థలాల సేకరణకు రెవెన్యూ యంత్రాంగం చర్యలు
-బలోపేతం కానున్న రైతు సమన్వయ సమితులు

అయిజ : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు సంపూర్ణ సహకారం అందించేందు కు తెలంగాణ ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రతీ క్లస్టర్‌ పరిధిలో ఒక రైతు సమా ఖ్య సమావేశ మం దిరాల (రైతు వేదికలు) భవన నిర్మాణా లు చేపట్టేందుకు నిర్ణయించింది. ఇం దుకు ప్రభుత్వం ఒక్కో భవనానికి సూ మారు రూ. 15 లక్షలు ఖర్చు చేయనుం ది. ఇప్పటికే ప్రతి 5 వేల హెక్టార్లకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించిన విషయం విధితమే. జిల్లా వ్యా ప్తంగా 98 క్లస్టర్లు ఉన్నాయి.

క్షేత్ర స్థా యిలో రైతుల చేత రైతు సమన్వయ స మితుల సభ్యులకు పలు దఫాలుగా అవగాహన సదస్సులూ ఏర్పాటు చేసింది. మరికొద్ది రోజులలో పంట సాగు, మా ర్కెటింగ్‌, అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చే స్తోంది. వీటి నిర్వహణ కోసం ప్రత్యేకం గా సమావేశ మందిరాలు ఏర్పాటు చే యాలని సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయం గా నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి అనుగుణంగా జిల్లా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా 98 రైతు వేదికల నిర్మాణాలకు స్థలాల గుర్తింపునకు చర్యలు చేపట్టారు. స్థలాల ఎంపిక పూర్తికాగానే నిర్మాణ ప నులు చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగు లు వేస్తోంది. వచ్చే వానాకాలం పంటల సాగులోపు రైతు వేదిక భవనాలు ఏర్పా టు చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అలంపూర్‌ వ్యవసాయ డివిజన్ల పరిధిలో 98 క్లస్టర్ల పరిధిలో ఒక్కో భవన నిర్మాణం చేపట్టను న్నారు.


క్షేత్రస్థాయిలోనే నిర్వహణ,
మార్కెటింగ్‌..
క్లస్టర్‌స్థాయిలో ఏర్పాటు చేసే రైతు స మావేశ మందిరాలు పలు కీలక నిర్ణయాలకు వేదికగా మారనున్నాయి. స్వ యం సహాయ సంఘాల మాదిరిగానే రైతు సమాఖ్య సమావేశాలు కూడా ప్రతి నెల విధిగా జరుగనున్నాయి. ఈ సమావేశంలో తీసు కున్న నిర్ణయాలకు అనుగుణంగానే సాగు నిర్వహణ జరుగనుం ది. పండించిన పంటకు మార్కెట్లో సరై న ధర లేని పక్షంలో స్థానిక కమిటీలే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నాయి.


రైతు సమస్యల
పరిష్కారానికి వేదికలు..
రైతు వేదికలు వ్యవసాయ అభివృద్ధికి కేంద్రాలు కానున్నాయి. వ్యవసాయ అ ధికా రులు అందుబాటులో ఉండి పం టల సాగు విధానాలు, విత్తనాలు, ఎరువుల విక్రయం, గిట్టుబాటు ధరలు, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మం దుల వాడకం వంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపనున్నాయి.


బలోపేతం కానున్న
సమన్వయ సమితులు..
రైతు వేదికల ఏర్పాటుతో రైతు సమన్వయ సమితులు బలోపేతం కానున్నాయి. కమిటీలు ఏర్పాటు చేసిన తరువాత పలు దఫాలుగా సమితుల సభ్యు లు రైతులకు అవగాహన కల్పించనున్నారు. కమిటీల సభ్యులు ఎప్పటికప్పు డు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు అధి కారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles