ఆకట్టుకుంటున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

Thu,December 5, 2019 03:37 AM

గద్వాల న్యూటౌన్‌ : గద్వాలలోని చింతలపేటలో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల జగదీశ్‌ చం ద్రబోస్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞాణిక ప్రదర్శనలు రెండో రోజుకు చేరుకున్నాయి. బుధవారం జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శనలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రదర్శనలు చూసేందుకు వివిధ పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో జగదీశ్‌ చంద్రబో స్‌ ప్రాంగణానికి తరలివచ్చారు. రెండో రోజైనా బు ధవారం విద్యార్థులు 296 ప్రదర్శనలు ప్రదర్శించా రు. ప్రదర్శనలో భాగంగా విద్యార్థులకు సెమినార్‌, క్విజ్‌ పోటీలు నిర్వహించారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ట్రైనీ కలెక్టర్‌ శ్రీహర్ష తో పాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఖదీర్‌లు తిలకించి ప్రతిభను ప్రశంసించారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles