అమ్మాయిలూ.. ధైర్యాన్ని నింపుకోండి

Thu,December 5, 2019 03:37 AM

-ఆకతాయిలు ఇబ్బందులకు గురి చేస్తే గట్టిగా నిలదీయండి
-వెనకడుగు వేయొద్దు.. ధైర్యమే ఎంతో బలాన్నిస్తోంది
-తక్షణ సహాయంకోసం డయల్‌ 100 లేదా 198ను సంప్రదించండి
-నా భద్రత.. నా పోలీసు అవగా హన సదస్సులో డీసీపీవో కుసుమలత

గద్వాల క్రైం: ఏదైనా అనుకోని స్థితిలో ఆపద వచ్చినప్పుడు ఆడపిల్లల మనే అధైర్యపడకుండా భయానక పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయాలని డీసీపీవో కుసుమలత విద్యార్థినులకు మ నో ధైర్యాన్ని నింపారు. గద్వాలలోని జ్ఞానప్రభ కళాశాలలో బుధవారం ఇన్‌చార్జి ఎస్పీ ఆదేశాల మేరకు గద్వాల టౌన్‌ ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యాన నా భద్రత-నా పోలీసు అనే అంశంపై విద్యార్థినులకు అవగాహన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీసీపీవో కుసుమలత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని చేతకాదన్న భావనను విడనాడాలన్నారు. ఎప్పుడైతే ప్రతి అంశంలోనూ ధైర్యాన్ని నింపుకుంటామో ఎ లాంటి ఇబ్బందులు తమ దగ్గరకు రావని ఆమె హితవుపలికారు. సమాజంలో మంచివారితో పాటు ఆక తాయిలూ తారసపడుతుంటారని, వారిపై ఒక కన్నే సి ఉంచాలన్నారు.

మహిళలకు రక్షణగా 100, 198, షీటీం నంబర్‌ 7993131391కు డయల్‌ చే యాలన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆడపిల్లను ఇంటి కుటుంబ సభ్యులుగా.. సోదర భావంతో చూ డాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనను ఎప్పటికపుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. విద్యార్థినులు కూడా అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతకుముందు గద్వాలటౌన్‌ ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థినులు తమ కు అభద్రతా భావం ఉందనకున్నప్పుడు తప్పనిసరిగా 100కు డయల్‌ చేయాలన్నారు. ఎవ రూ ఇబ్బందులకు గురిచేసినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సమాచారం అందించాలన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో షీ టీం ఉంటుందన్నారు. వారి సేవలను తప్పక వినియోగించుకోవాల న్నారు. షీ టీం ఇన్‌చార్జి దివ్య మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితులో విద్యార్థినులు ఇతరులను వెంటనే నమ్మరాదన్నారు.

రద్దీ ప్రాంతంలో పాఠశాల, కళాశాలల, సినిమా థియేటర్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ తదితర ప్రాంతాల్లో షీ టీం సభ్యులు మ ఫ్టీలో ఉంటారన్నారు. అంతకుముందు పలువురు విద్యార్థినులు కళాశాల విడిచిన తర్వా త బస్టాండ్‌కు వెళ్లే క్రమంలో ఆకతాయి లు మోటార్‌ బైక్‌లపై వ స్తూ న్యూసెన్స్‌ చేస్తున్నారని, అదేవిధంగా కొంద రు ఆటో డ్రైవర్లు కూడా తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని పోలీసు ల దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థినుల సమస్యల వి న్న టౌన్‌ ఎస్సై సత్యనారాయణ ఇక మీదట అ లాంటివి జరుగకుండా క ట్టుది ట్టమైన చర్యలు చేపడుతామని భరోసా ఇచ్చా రు. కా ర్యక్రమంలో సఖీ నిర్వాహకురాలు సుజాత, జ్ఞానప్రభ కళాశాల గౌరవ ప్రిన్సిపాల్‌ హంపయ్య, కరస్పాండెంట్‌ అప్సర్‌పాష, కార్యదర్శి రవీందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ రవిశంకర్‌, బ్లూ కోల్ట్‌ సిబ్బంది బాలరాజు, జగదీశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

మహిళా సంరక్షణపై అవగాహన
అలంపూర్‌, నమస్తే తెలంగాణ: సమాజంలో పోకిరీలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ రాజు అన్నారు. బుధవారం మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లో ఏర్పాటు చేసిన మహిళల సంరక్షణ అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు పోకిరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 198, షీటీం నంబర్‌ 7993131391కు సంప్రదించాలన్నారు. కార్యక్రమ ంలో ఎస్సై మధుసూదన్‌రెడ్డి, పోలీస్‌ చిన్నయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles