విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

Thu,December 5, 2019 03:35 AM

-పంట రక్షణకు వేసిన కంచెకు తగిలికరెంట్‌ షాక్‌తో రైతు మృతి
-హెచ్‌టీ విద్యుత్‌ వైరు తెగిపడి మరొకరు
-విషాదంలో కుటుంబీకులు, గ్రామస్తులు
కోస్గి : పందు ల బారి నుంచి పం టను కాపాడుకునేందుకు కంచె గా ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైరుకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ సంఘటన గుండుమాల్‌ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. కోస్గి ఎస్సై నాగరాజు, గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గుండుమాల్‌ గ్రామానికి చెందిన రైతు బూసం నర్సింహ్మారెడ్డి రోజు వారీగా తన పొలానికి వెళ్లాడు. తన వరి పంటను కాపాడుకునేందుకు పంట చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైర్‌ను తొలగించే క్రమంలో విద్యుదాఘాతానికి గురైనట్లు వారు తెలిపారు. సంఘటనా స్థలంలోనే నర్సింహ్మారెడ్డి(55) మృతి చెందాడన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకట్‌రాంరెడ్డి డిగ్రీ చదువుతున్నాడు. రెండవ కుమారుడు కృష్ణారెడ్డి డైట్‌ పూర్తి చేశాడు. గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండే ఇతను విద్యుదాఘాతంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విద్యుదాఘాతంతో యువకుడు..
అయిజ : మండలంలోని ఉప్పల గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ యువ రైతు మృతి చెందిన సంఘటన చోటుచేసుకున్నది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల గ్రామానికి చెందిన జయన్న (25) తన పొలానికి వెళ్లి రసాయనిక మందు పిచికారి చేసేందుకోసం తమ్ముడు వినోద్‌తో కలిసి వరి పొలం దగ్గరకు వెళ్తున్నాడు. అక్కడ హెచ్‌టీ విద్యుత్‌ తీగ ఒకటి తెగికింద పోయింది. దాన్ని గమనించక పొలం గట్టుపై పడి ఉన్న తీగను తొక్కడంతో విద్యుదాఘాతానికి గురై అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. జయన్న వెనుకనే వస్తున్న తమ్ముడు అన్నను కాపాడేందుకు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదన్నారు. పరిసరాల్లో ఉన్న రైతులను పిలిచి కరెంట్‌ నిలిపివేశారన్నారు. అప్పటికే జయన్న మృతి చెందినట్లు పేర్కొన్నారు. తమ్ముడు వినోద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మృతుడి కుటుంబానికి విద్యుత్‌ శాఖ పరంగా ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles