మారిన వార్డుల స్వరూపం

Thu,December 5, 2019 03:35 AM

గద్వాలటౌన్‌ : గద్వాల మున్సిపాలిటీ వార్డుల స్వరూపం పూర్తిగా మారిపోయింది. గతం కంటే భిన్నంగా వార్డులు మారాయి. అన్ని వార్డుల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. తక్కువ ఓటర్లు ఉన్న చోట నివాస గృహాలు కలపడంతో అక్కడ ఓటర్లు పెరిగారు. మరికొన్ని వార్డుల్లో నివాసగృహాలను తొలగించడంతో ఓటర్లు తగ్గారు. దీంతో వార్డుల విభజనపై అభ్యనర్థలు వెల్లువెత్తాయి.

మారిన వార్డుల భౌగోళిక స్వరూపం...
రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ఆదేశాల మేరకు జీవో 78 ప్రకారం, రూల్‌ 4,5 ప్రకారం చేపట్టిన పునర్విభజనతో వార్డుల భౌగోళిక స్వరూపాలన్ని కూడా పూర్తిగా మారి పోయాయి. వార్డుల హద్దులు మారడంతో పాటు ఓటర్ల సంఖ్య కూడా మారి పోయింది. ప్రతి వార్డులో 1500 మంది నుంచి 1650 మంది ఓటర్లు వచ్చేలా సంఖ్యను నిర్ణయించా రు. అయితే ఈ మధ్యనే విలీనమైన గ్రామ పంచాయతి వెంకటపేట, నది అగ్రహారాన్ని కలుపుతూ 1వ వార్డుగా ప్రకటించారు. ఈ వార్డులో మాత్రమే 1200మంది ఓటర్లు ఉన్నారు. పట్టణానికి 3కిలో మీటర్ల దూరంలో ఈ గ్రామాలు ఉండడంతో సమీప వార్డుల నుంచి ఓటర్లను కలిపేందుకు వీలు కాలేదని అధికారులు వెల్లడించారు.

వెల్లువెత్తిన అభ్యంతరాలు..
నూతనంగా ప్రకటించిన వార్డులపై మొదటి రోజు అభ్యంతరాలు వెల్లువె త్తాయి.15, 17, 18, 19, 20, 21, 23, 31, 32 వార్డులు పూర్తిగా భౌగోళికంగా గాని, ఓటర్ల పరంగా గాని అస్తవ్యస్తంగా రూపొందించారని ఆరోపిస్తూ ఆయా వార్డుల మాజీ కౌన్సిలర్లు, నాయకులు కమిషనర్‌ నర్సింహకు బుధవారం అభ్యర్థ నలు సమర్పించారు. వార్డుల విభజన అంతా కూడా మరోసారి అధికారులు అశా స్త్రీయంగా చేపట్టారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. ఉదాహరణకు ఇంటి నంబర్‌ 1-6-1 నుంచి 1-6-100 వరకు గతంలో ఒకే వార్డులో ఉండేదని కొత్త జాబితా ప్రకారం ఈ సిరీస్‌ మొత్తం కూడా నాలుగు వార్డుల్లో పొందుపరచారని ఇది పూర్తి విరుద్ధమని నాయకులు పేర్కొన్నారు. వచ్చిన అభ్యనర్థల మేరకు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్‌ వెల్లడించారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles