బల్దియాల్లో కొత్త చట్టం

Thu,December 5, 2019 03:34 AM

-ఆన్‌లైన్లో 12 రకాల సేవలు
-అక్రమాలకు చెక్‌ పెట్టేందుకే..
-వారంలో పరిష్కారం లేదంటే పెనాల్టే

అలంపూర్‌,నమస్తే తెలంగాణ : అభివృద్ధిని వేగవంతం చేసేందుకు బల్దీయాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమ లు చేస్తుంది. కమి షనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా 12 రకాల సేవలను ఇంటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా వారంలోగా పొందేందుకు అవకాశం కల్పిం చింది. అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించిన తర్వాత వారంలో రోజుల్లో ధ్రువీకరణ పత్రాలు, అనుమతులు రాకుంటే దరఖాస్తుదారుడికి రూ.500 చొప్పున అధికారులు జరిమానా చెల్లించాలనే నిబంధనలను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇంటి పన్ను పేరు మార్పిడి, ఇంటి యాజమాన్య పత్రం, జనన, మరణ ధ్రువీకరణ, ఇంటి కొలతలకు సంబంధించిన సేవలు, అన్ని కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ నుంచి పొందుపర్చిన వెబ్‌ సైట్‌ నుంచి పొందేలా పురపాలక శాఖ ప్రక్రియను చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ శాఖ కొత్త చట్టం ప్రకారం

CDMA TELANGANA. GOV.IN వెబ్‌ సైట్‌ ద్వారా ఇంటి పన్ను, తదితర సేవలు పొందవచ్చును. రాష్ట్ర ప్రభు త్వం తీసుకువచ్చిన ఈ నూతన పద్ధతి తో బల్దియాల్లో పనులు వే గంగా జరగడంతో పాటు, జవాబుదారి తనం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జిల్లాలో నాలుగుమున్సిపాలిటీలు
జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్‌, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉ న్నాయి.ఆన్‌ లైన్‌ సేవల ద్వారా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఇంటి నిర్మా ణం చేసిన త ర్వాత ఇంటి నెంబర్‌ కో సం అవసరమై న ధ్రువ పత్రాలతో దరఖాస్తు చేసుకునే వారు ధ్రువీకరణ పత్రా ల పరిశీలన అ నంతరం మున్సిపల్‌ సి బ్బంది ఇంటి నెంబర్‌ కెటాయించే అవకాశం ఉండేది. ఈ పనులు త్వరగా జరగాలంటే గతం లో అధి కారుల చేతికి అంతో ఇంతో అమ్యామ్యాలు అప్ప జెప్పక తప్పెది కాదు. ఇవ్వక పోతే అది సరిగా లేదు, ఇది సరిగా లేదు అని నెలల తరబడి కాలయాపన చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రవేశపెడుతున్న నూతన పద్ధ తి ద్వారా అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఇంటి కొలతలు, మ్యాప్‌తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు తో పాటు అధికారులకు అందజేస్తే ఎంత పన్ను చెల్లించాలన్న విష యం తెలియచేస్తారు. అనంతరం క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలన చేసి వా రం రోజు ల్లో ఇంటి నెంబర్‌, అనుమతి పత్రాలు మంజూరు చేస్తూ ఉత్తర్వూలు జారీ చేస్తారు.


పనులు చేయకుంటే విధించే జరిమానాలు
మున్సిపల్‌ నుంచి అందాల్సిన పౌరసేవ ల్లో జాప్యం జరిగితే సంబంధిత విభా గం బాధ్యులపై జరిమానాలు విధించే లా నిబంధనలను కొత్త చట్టంలో పొం దు పర్చారు. సీడీఎంఏ వెబ్‌ సైట్‌ దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తుపై అధికారులు స్పందించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పని తీరును ఏడు రోజుల్లో పూర్తి చేస్తారు. అలా చేయని పక్షంలో వివరణ ఇస్తారు. సరైన కార ణం లేకుండా పనిలో జాప్యం జరిగితే సంబంధిత విభాగం అధికారికి రోజుకు రూ.500 జరిమానా విధించే ఏర్పాట్ల ను కూడా చట్టంలో తీసుకువచ్చారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles