పంచాయతీకో ట్రాక్టర్

Sun,November 17, 2019 12:24 AM

-స్వచ్ఛ పంచాయతీలకు సర్కారు అండ
-పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం..
-జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు
-త్వరలో అందించేందుకు అధికారుల ఏర్పాట్లు
అయిజ : సంపూర్ణ పారిశుధ్యం, మొక్కల పరిరక్షణే లక్ష్యంగా సర్కారు మరో నిర్ణ యం తీసుకున్నది. ఇంటింటా చెత్త సేకరణ .. ముళ్ల పొదల తొలగింపు.. హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు నీళ్లు పోసే పనులు చేసేందుకు ప్రతి పల్లెకూ ట్రాక్టర్, ట్రాలీలు, ఆటో రిక్షాలు అందించనున్నది. పల్లెలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు 30 రోజుల పల్లె కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా నిర్వ హించిన రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణను పక్కాగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. ప్రతి గ్రామ పం చాయతీకో ట్రాక్టర్‌తోపాటు నీళ్ల ట్యాంకర్‌ను కొనుగోలు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ట్రాక్టర్ కొను గోలుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల్లో చైతన్యం వచ్చినందున తడి, పొడి చెత్త రోడ్లపై వేయకుండా ప్రత్యేకంగా చెత్తబుట్టలను ఇంటింటికీ పంపిణీ చేస్తు న్నారు. చెత్తను డంపింగ్ చేసేందుకు యార్డులను కూడా ఏర్పాటు చేస్తుండటంతో చెత్తను తరలించడానికి వాహనాలు అవసరమని గుర్తించిన సర్కారు, హరితహారం మొక్కల ఎదుగుదలకు అవసర మైన నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్లను సైతం పంచాయతీల్లో ట్రాక్టర్లను కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ట్రాక్టర్లను కొనుగోలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా ..
పల్లెల్లో సంపూర్ణ పారిశుద్ధ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంటింటా చెత్త సేకరణ, ముళ్ల పొదల తొల గింపు, హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు నీళ్లు పోసి పనులు చేసేందుకు ప్రతి పల్లెకూ ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్, ట్రాలీలు, ఆటో రిక్షాలు, డోజర్లను అందించనున్నది. జనాభా ప్రాతిపదికన నిధులు న్న పంచాయతీ నేరుగా ట్రాక్టర్‌ను కొనుగోలు చేయనుండగా, నిధులు లేని జీపీలకు బ్యాంక్‌ల ద్వారా రుణం తీసుకుని రిక్షాలు కొనుగోలు చేయనున్నారు. త్వరలోనే ట్రాక్టర్లను గ్రామ పంచా యతీలు కొనుగోలు చేసేలా అధికారులు, సర్పంచులు సిద్ధమ వుతున్నారు. పంచాయతీ నిధులతో ట్రాక్టర్లు కొనుగోలు చేయ డానికి ముందుకు వచ్చే గ్రామాల వివరాలను సేకరిస్తున్నారు. ట్రాక్టర్లను కొనుగోలు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతత్వంలో జిల్లా స్థాయి కమిటీ, మండల స్థాయిలో ఎంపీడీవో, డీఎల్‌పీవోలతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 255 జీపీలకు ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ఆటో ట్రాలీలను విధిగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రతీ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు తప్పనిసరి ..
జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, మినీ ట్రాక్టర్లు తప్పని సరిగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామ పంచాయతీలలో నిధులు ఉన్న జీపీలు నేరుగా ట్రాక్టర్లు, ట్యాంకర్లు కొనుగోలు చేయాలని ఆదేశించాం. నిధులు లేని జీపీలు బ్యాంక్ గ్యారెంటీతో ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 255 జీపీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. త్వరలోనే జీపీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- కృష్ణ జిల్లా పంచాయతీ అధికారి, జోగుళాంబ గద్వాల

87
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles