బీచుపల్లి ఆయిల్ మిల్లుకు మహర్దశ

Sun,November 17, 2019 12:21 AM

-పునరుద్ధరణకు రంగం సిద్ధం
-ఆయిల్ ఫాం మొక్కలను నాటనున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
-వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా రూ.8.44కోట్లు చెల్లింపు
-మొక్కల పెంపకానికి ఆత్మకూరు, అలంపూర్, గద్వాల, కొల్లాపూర్,
నాగర్‌కర్నూల్, వనపర్తి, ప్రాంతాలు అనువైనవిగా గుర్తింపు
జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి పాలమూరు ప్రజలకు శుద్ధమైన నూనెను అందించాలనే సదుద్దేశంతో ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో జాతీయ రహదారి పక్కన 93 ఎకరాల విస్తీర్ణంలో బీచుపల్లి విజయవర్ధనే ఆయిల్ మిల్లు ఏర్పాటు చేశారు. జో గుళాంబ గద్వాల జిల్లాలో పండించే వేరుశనగ నుంచి నూనె తీయడంతో పాటుగా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందు కు గాను ఏర్పాటు చేసిన ఆయిల్‌మిల్లు సీ మాంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి 2003 సంవత్సరంలో మూతపడింది. ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆయిల్ పూర్వవైభవం తీసుకరావడానికి మంత్రి నిరంజన్‌రెడ్డి కృతనిశ్చయంతో ముం దుకు సాగుతున్నారు. ఈప్రాంత రైతులకు ప్రయోజనం కలిగేలా మిల్లును ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయంపై ఆయన ప్రత్యేక దృష్టిసారించారు.

ఆర్థిక ఇబ్బందులతో మూతబడిన మిల్లు
1990లో ఏర్పడి దశాబ్దం కాలంపాటు మంచి లాభాలతో నిర్వహించారు. క్రమేపీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో జూన్ 2003లో మిల్లును మూసివేశారు. ఆ రోజుల్లో మిల్లు మూసివేతకు నిరసనగా సమైక్య ప్రభుత్వానికి వ్యతి రేకంగా రైతులు కార్మికులు మద్దుతుగా అప్పటి ఉద్యమ నేత ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి సింగిరెండ్డి నిరంజన్ రెడ్డి పోరా టం చేశారు. స్వరాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయశాఖ మంత్రిగా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తిరిగి పునరుద్ధరణ చేపడుతున్నారు. ఈ కా ర్యక్రమంతో రైతుల చిరకాల వాంఛ నెరవేరనుంది.

వన్‌టైం సెటిల్‌మెంట్ ఒప్పందం
బీచుపల్లి ఆయిల్ మిల్లు పునరుద్ధరణకు జా తీయ పాడి అభివృద్ధి సంస్థకు ఉన్న రూ. 26.03 కోట్లు అప్పు వన్ టైం సెటిల్‌మెంట్‌కు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పం దం ద్వారా రూ. 8.44 కోట్లును తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్ధ చెల్లించనుంది. మొదటి చెల్లింపుగా రూ.4.22 కోట్లు ఇప్పటికే చెల్లించారు. నూనె గింజల పంటలలో స్వయం స మృద్ధి సాధించడం కోసం మధ్యవర్తుల ప్రమే యం లేకుండా నూనె గిం జల సహకార సం ఘాల ఏర్పా టు చేయడం దీని ముఖ్య ఉద్దే శం. జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ సహకారంతో 200 టన్నుల సామర్థ్యం గల నూనె మిల్లు లు, 100 టన్నుల సా మర్థ్యం గల సాల్వెంట్ ఆయిల్ మిల్లు, 100 టన్నుల సామర్థ్యం గల రిఫైనరీ ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగింది.

పామాయిల్ మొక్కల పెంపునకు సహకారం
తెలంగాణలో పరిశోధనలు నిర్వహించిన కేం ద్ర ఆయిల్ ఫామ్ సంస్థ 206 మండలాలు ఆయిల్ ఫామ్‌కు అనుకూలమని తేల్చారు. వీటిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆత్మ కూరు, అలంపూర్, గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, ప్రాంతాలు అనువైనవిగా గుర్తించారు. పామాయిల్ మొక్కలను పెం చేందుకు రైతులకు ప్రభుత్వం సహకారాన్ని కూడా అదించనున్నారు. పామాయిల్ మొక్కలను పెంచేందుకు ఎరువుల కోసం నాలుగేళ్ల కోసం హెక్లార్టుకు, రూ. 20వేల సబ్సిడీని అందించనున్నారు. నిరంతరం ఈ పంటలను సాగు చేసేందుకు అవకాశాన్ని కల్పించనున్నారు.

ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన..
నాలుగేళ్ల నుంచి ప్రారంభమైన 30ఏళ్ల వరకు ఏడాది పొడవునా దిగుబడి వచ్చే ఆయిల్ ఫామ్‌ను పెంచేందుకు కావల్సిన మెళకువల ను రైతులకు నేర్పించనున్నారు. ఈ పంటల ను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రైతుల ఖాతాలోకి నగదును టీఎస్ ఆయిల్ ఫెడ్ జమచేయనున్నది. ఈ పంటల సాగు వలన ఎకరాకు ఖర్చులు పోను రూ. 75వేల నుంచి రూ.80వేల వరకు రైతులకు ఆదాయం సమకూరనుంది. ఆయిల్ పాం సాగుచేసే సత్తుపల్లి, అశ్వారావు పేట, అప్పారావు పేట, పశ్చిమ గోదావరి ప్రాంతాలకు మంత్రి నిరంజన్ రెడ్డి 1000 మంది రైతులను తీసుకొని వెళ్లి అవగాహనలు కల్పించనున్నారు. వచ్చే సీజన్ నాటికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగుచేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ కర్మగారాన్ని రైతులకు అందుబాటులో ఉండేందుకు మిల్లును పునరుద్ధరించనున్నారు.

75
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles