ఇంటర్ విద్యార్థులకు అండగా..

Sat,November 16, 2019 01:03 AM

అయిజ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మనోైస్థెర్యం పెంచేందుకు ప్రభుత్వ కళాశాలల్లో కౌన్సిలర్లను నియమించేందుకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫలితాలు విడుదల చేసిన స మయంలో ఈ పరిస్థితి మరింత అధికమవుతుం ది. మానసిక ఒత్తిడి నుంచి విద్యార్థులు బయటపడేందుకు కౌన్సిలర్ల నియామకం చేపడుతున్నది. బడుల్లో ఉపాధ్యాయులు, ఇంటి వద్ద తల్లిదండ్రు ల పర్యవేక్షణ జాగ్రత్తలు ఎక్కువగా కనిపిస్తాయి. పదో తరగతి నుంచి ఇంటర్‌లోకి అడుగు పెట్టిన విద్యార్థికి స్వేచ్చ పెరుగుతుంది. ఆలోచన విధానంలో మార్పు మొదలవుతుంది. స్నేహితల ఎం పిక, అలవాట్లు, జీవనశైలిపై ప్రభావాన్ని చూపుతాయి. అధ్యాపకుల పర్యవేక్షణ అతంత మాత్రంగానే ఉండడం స్థిరమైన ఆలోచనలు కొరవడి సందిగ్దత ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఒత్తిడి పెరిగి విపరీత పరిణామాలకు దారి తీస్తుం ది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లను నియమించి చదువు లో మెళుకువలు, పరీక్షలకు సన్నద్ధమయ్యే విధానం, ప్రేరణ కలిగించడం, జ్ఞాప కశక్తి పెంచుకునే విధానం తదితర అంశాలను విద్యార్థులకు వివరించేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటోంది. మార్కులే జీవనం కాదని వివరించడంతోపాటు అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలో అవగాహన కల్పించనున్నారు.
అధ్యాపకులకు అవకాశం ..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాబోధన చేస్తున్న అధ్యాపకులకు కౌన్సిలర్లు గా నియమించారు. జిల్లాలోని 8 ప్రభుత్వ కళాశాలల్లో కౌన్సిలర్లను నియమించి విద్యార్థులు ఒత్తిడిని జయించేలా అవగాహన కల్పించనున్నారు. ఎంపికైన అధ్యా పకులకు ఈ నెల 19,20 తేదీలలో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వను న్నారు. జిల్లాలోని 8 కళాశాలల్లో కౌన్సిలర్లను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన అధ్యాపకులు శిక్షణకు హాజరయ్యేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ..
ఇంటర్ కళాశాలల్లో ఫలితాల మెరుగుదలపైన అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే కళాశాలల వారీగా ప్రత్యేక తరగతుల నిర్వహణ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. మనోైస్థెర్యం పెంచేందుకు కౌన్సిలర్లలను నియమించడంతో వెనుకబడిన విద్యార్థుల్లోని లోపాలను గుర్తించి వాటిని అధి గమించడానికి చర్యలు తీసుకుంటున్నారు. వెనుకబడిన విద్యార్థులు ఎదిగే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిపై దృష్టి సారించాలని ఇంటర్ బోర్డు అధికారులు కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాలో 8 కళాశాలల్లో
కౌన్సిలర్ల నియామకం ..
జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కౌన్సిలర్లను నియమించారు. 8 కళాశాలల్లో మొదటి సంవత్సరం 1,738 మంది, రెండో సంవత్సరం 1,256 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి కళాశాలకు ఒక కౌన్సిలర్‌ను నియమించి విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఎంపికైన అధ్యాపకులకు హైదరాబాద్‌లో మానసిక నిపుణులచే శిక్షణ ఇవ్వనున్నారు. చదువు, ఒత్తిడి, పరీక్షలు, జ్ఞాపకశక్తి, ప్రేరణ వంటి అంశాలపైన శిక్షణ ఇస్తారు. అనంతరం అధ్యాప కులు కళాశాలల్లో విద్యార్థులకు ఒత్తిడి జయించేలా అవగాహన కల్పించి విద్యార్థులలో మనోైస్థెర్యం నింపనున్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles