రెవెన్యూ ఉద్యోగులకు కట్టుదిట్టమైన భద్రత

Sat,November 16, 2019 01:03 AM

-ప్రతి తాసిల్దార్ కార్యాలయంలో సీసీ కెమెరా ఏర్పాటు
-తాసిల్దార్‌ల సమీక్షలో కలెక్టర్ శశాంక
గద్వాల, నమస్తే తెలంగాణ: రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ద్వారా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శశాంక స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అడిషనల్ ఎస్పీ కృష్ణ, జిల్లాలోని తాసిల్దార్‌లు, డీటీలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి తాసిల్దార్ కార్యాలయంలో పాయింట్ బుక్ పెట్టడం జరిగిందని దీని ప్రకారం స్టేషన్‌హౌజ్ అధికారి ప్రతిరోజు సమయానుసారం వచ్చి పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రతి సోమవారం ప్రజావాణి రోజు పెట్రోలింగ్ బృందంతో పాటు తాసిల్దార్ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తారన్నారు. వాస్తవంగా ప్రతి తాసిల్దార్ కార్యాలయం వద్ద ఒకరు లేదా ఇద్దరు పోలీసులను ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ జిల్లాలో సరైనా పోలీస్ సిబ్బంది లేని కారణంగా ఈ విధమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

ఫిర్యాదుల రోజున వీఆర్‌ఏను కాపలా పెట్టాలని ఫిర్యాదుదారులు ఎలాంటి బ్యాగులు, కవర్లు లోపలికి అనుమతించకూడదని సూచించారు. ప్రతి తాసిల్దార్ కార్యాలయంలో సీసీటీవీ పెట్టాలని దానికి సంబంధించిన తెర తాసిల్దార్ మందు కనిపించే విధంగా చేయడంతో పాటు సంబంధిత ఎస్‌హెచ్‌వో వద్ద కనిపించే విధంగా ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణకు ప్రతిరోజు ఒక సమయం కేటాయించి ఆ సమయాన్ని సూచిస్తూ సైన్‌బోర్డు పెట్టాలని ఆదేశించారు. దానితో పాటు ప్రతి రోజు కార్యాలయానికి వచ్చే సందర్శకుల రిజిష్టర్ నిర్వహించాలని చెప్పారు. ఇక నుంచి అన్ని తాసిల్దార్ కార్యాలయాల్లో పాయింట్ బుక్ ఏర్పాటుతో పాటు ప్రజావాణి రోజు పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు భద్రత ఏర్పాటుచేయాలని ఏఎస్పీకి ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ నిరంజన్, ఆర్డీవో రాములు తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles