గద్వాల న్యూటౌన్ : గద్వాలలోని జిల్లా ప్రభుత్వ దవాఖానాలో శుక్రవారం గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 95 మంది గర్భిణులకు గైనకాలజిస్ట్లు డాక్టర్ శోభారాణి, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ అశ్విని, డాక్టర్ నర్మదారెడ్డిలు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు చేయించుకున్న 95 మందిలో 32 మంది గర్భిణులు హైరిస్క్‌తో ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు.
నలుగురిని ఆపరేషన్‌కు రెఫర్ చేశారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న 6 గురిని దవాఖానలో చేర్చుకున్నారు. కార్యక్రమంలో హెల్ప్ డెస్క్ సూపర్ వైజర్ శ్యామ్‌సుందర్, వివిధ గ్రామాల ఆశా కార్యకర్తలు తపాల్గొన్నారు.